Warning: session_start() [function.session-start]: Cannot send session cookie - headers already sent by (output started at /home/content/76/6254476/html/WS19/VO19/index.php:4) in /home/content/76/6254476/html/WS19/VO19/libraries/joomla/session/session.php on line 423

Warning: session_start() [function.session-start]: Cannot send session cache limiter - headers already sent (output started at /home/content/76/6254476/html/WS19/VO19/index.php:4) in /home/content/76/6254476/html/WS19/VO19/libraries/joomla/session/session.php on line 423

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home/content/76/6254476/html/WS19/VO19/index.php:4) in /home/content/76/6254476/html/WS19/VO19/libraries/joomla/session/session.php on line 426
వ్యాధులు - నివారణ Vijayawada Online.. The First Vijayawada Information Portal. Tourism, Chat, Free Classifieds, Jobs, Chating, Radio, TV, Education, Games & more.... http://www.vijayawadaonline.com/health-care.html Sat, 27 Nov 2021 14:30:57 +0000 Joomla! 1.5 - Open Source Content Management en-gb అల్సర్స్ - Ulcer http://www.vijayawadaonline.com/health-care/865-ulcer.html http://www.vijayawadaonline.com/health-care/865-ulcer.html ulcerస్టమక్ అల్సర్స్

ఆహారాన్ని జీర్ణం చేయడానికి మన కడుపులో ఆమ్లం స్రవిస్తూ ఉంటుంది. అది ఆమ్లం కాబట్టి  ఆహారంపై పనిచేయడానికి బదులుగా మన కడుపు కండరాల మీదే పని చేస్తే కడుపులో మంట వస్తుంటుంది. ఇది చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే. యాసిడ్ వల్ల కనిపించే ప్రభావం కాబట్టి దీన్ని వాడుకభాషలో సైతం ‘ఎసిడిటీ’ అంటూ చాలామంది పేర్కొంటుండటం వల్ల ఇది ప్రజల్లో ఎంత ప్రాచుర్యంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ అదే యాసిడ్ క్రమక్రమంగా కడుపులోని కండరాలపై పనిచేస్తూ పోతే... జీర్ణవ్యవస్థ పొడవునా చాలా చోట్ల పుండ్లు పడే  అవకాశం ఉంది. అయితే ఇలా పుండ్లు పడటంలో వేళ తప్పి తినడం లాంటి వాటి కంటే హెచ్. పైలోరీ అనే బ్యాక్టీరియా, ఆస్పిరిన్ వంటి రక్తాన్ని పలచబార్చే మందులు, ఐబూప్రొఫిన్ వంటి నొప్పి నివారణ మందులు (ఎన్‌ఎస్‌ఏఐడీస్) ఎక్కువగా కారణమవుతాయి. ఈ పుండ్లనే పెప్టిక్ అల్సర్స్ అని వ్యవహరిస్తుంటారు.  ఇటీవల ఈ పెప్టిక్ అల్సర్లు ఎక్కువయ్యాయి. ఈ సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం.
 ]]>
వ్యాధులు - నివారణ Tue, 20 Jan 2015 10:44:47 +0000
స్వైన్‌ ఫ్లూ - swine flu http://www.vijayawadaonline.com/health-care/864-swine-flu-symptoms.html http://www.vijayawadaonline.com/health-care/864-swine-flu-symptoms.html symptoms of swine flu

స్వైన్‌ఫ్లూ వ్యాధిని సంక్రమింపజేసే వైరస్‌కూ, పందులలోని శ్వాసకోశ వ్యాధిని తెచ్చిపెట్టే వైరస్‌కు పోలికలు ఉన్నాయి కాబట్టి దీన్ని స్వైన్‌ఫ్లూ అన్నారు.ఇదీ సాధారణ ఫ్లూ లాంటిదే. కాకపోతే ఇది కాస్త తీవ్రమైనది కావడంతో డయాబెటిస్, హైబీపీ, ఆస్తమా, సీఓపీడీ వంటి మరికొన్ని వ్యాధులతో బాధపడుతూ రోగ నిరోధకత తగ్గినవారిలో మరింత తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అయితే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు రుమాలు/ టిష్యూపేపర్ అడ్డుపెట్టుకోవడం, చేతులు అడ్డుపెట్టుకుని తుమ్మడం, దగ్గడం వంటివి చేశాక చేతులు శుభ్రంగా కడుక్కోవడం, లిఫ్ట్ వంటి క్లోజ్‌డ్ ప్రాంతాల్లో దగ్గు, తుమ్ములను ఆపుకోవడం, పరిశుభ్రతను పాటించడం లాంటి జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని చాలా తేలిగ్గా నివారించవచ్చు. వీటిని పాటించకపోతే అది మన స్వయంకృతాపరాధమై అనారోగ్యాన్ని ఆహ్వానించినట్లు అవుతుంది. అలా స్వైన్‌ఫ్లూ బారిన పడకుండా ఉండటంతో పాటు దాని గురించి సమగ్ర అవగాహన కోసమే ఈ కథనం.
 
ఎందుకీ పేరు... ఏమిటా కథ?


స్వైన్ అంటే పంది. ఫ్లూ అంటే ఇన్‌ఫ్లుయెంజా విభాగానికి చెందిన వైరస్‌లతో వ్యాపించే జలుబు. తొలుత ఈ వైరస్‌ను పరిశీలించినప్పుడు అది పంది శ్వాసకోశవ్యాధికి కారణమయ్యే ఒక వైరస్‌లోని జన్యువులతో పోలి ఉంది. అందుకే దీనికి హాగ్ ఫ్లూ, పిగ్ ఫ్లూ అనే పేర్లు పెట్టారు. ఇన్‌ఫ్లుయెంజాకు కారణమయ్యే అనేక వైరస్‌లలో ఒకటి జన్యుమార్పులకు లోనైంది. సాధారణంగా వైరస్‌లు అన్నీ ఇలా తమ జన్యుస్వరూపాలను మార్చుకుంటుంటాయి. పందుల్లో ఉండే ఈ వైరస్ తన యాంటిజెనిక్ స్వరూపాన్ని మార్చుకొని మనుషుల్లోకి వ్యాప్తిచెందడం వల్ల స్వైన్ ఫ్లూగా పేరు పెట్టారు. ఆ తర్వాత దీనిపై మరిన్ని పరిశోధనలు జరిగాయి. ఫ్లూను సంక్రమింపజేసే వైరస్‌లలో అనేక రకాలు ఉంటాయి. అందులో ‘ఇన్‌ఫ్లుయెంజీ ఏ’, ‘ఇన్‌ఫ్లుయెంజా బీ’, ‘ఇన్‌ఫ్లుయెంజా సీ’ అనేవి ముఖ్యమైనవి. స్వైన్‌ఫ్లూ వైరస్ అన్నది ఇన్‌ఫ్లుయెంజా ఏ రకానికి చెందిన వైరస్‌తో దగ్గరి పోలికలు కలిగి ఉంది. ఈ వైరస్‌లోని జీన్స్ ఉత్తర అమెరికా ఖండానికి చెందిన పందుల్లోని వైరస్‌తోనూ, యూరప్‌కు చెందిన పందుల్లోని వైరస్‌లతోనూ, ఆసియా దేశాల్లోని మరికొన్ని పక్షుల్లోని వైరస్‌లతోనూ, మనుషుల్లో వచ్చే ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లతోనూ... ఇలా నాలుగు రకాల వైరస్‌లు కలగలసినట్లుగా ఉండటంతో సైంటిస్టులు దీన్ని ‘క్వాడ్రపుల్ రీ అసార్టెంట్’ వైరస్‌గా పిలుస్తారు. అంటే నాలుగు రకాల వైరస్‌లు రూపు మార్చుకుని ఏర్పడ్డ కొత్త (మ్యూటెంట్) రూపం అన్నమాట. అందుకే పేరుకు స్వైన్ ఫ్లూ అయినా పందుల వల్ల ఇది సంక్రమించదు. కేవలం మనుషుల నుంచి మనుషులకే సంక్రమిస్తుంటుంది. వ్యావహారిక భాషలో స్వైన్‌ఫ్లూ అని పిలుస్తున్నా వైద్యులు మాత్రం దీన్ని తమ పరిభాషలో ‘హెచ్1ఎన్1 ఫ్లూ’ అని అంటారు.

ఈ సమయంలోనే ఎందుకు?
 

సాధారణంగా చలికాలం జలుబు వైరస్‌లు సంక్రమించడానికి అవకాశాలు ఎక్కువ. అదే కోవకు చెందినది కావడంతో ఈ
 ‘హెచ్1ఎన్1’ ఫ్లూ సైతం చలికాలంలోనే ఎక్కువగా వ్యాపిస్తోంది. గతంలోనూ చలికాలంలోనే ప్రపంచాన్ని గడగడలాడించిన ఈ వైరస్ ప్రస్తుతం ఈ చలికాలంలో మనదేశాన్ని గడగడలాడిస్తోంది. చలి వాతావరణం దీనికి అనుకూలం (హై విరులెంట్) కావడంతో ఇది ఈ సీజన్‌లో విస్తృతంగా వ్యాపిస్తోంది.

ఎలా వ్యాపిస్తుంది...?

ఇది మనిషి నుంచి మనిషికి వ్యాపించే ఫ్లూ. వ్యాధిగ్రస్తుడు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు గాల్లోకి వ్యాపించిన ఈ వైరస్... ఆరోగ్యవంతుడైన వ్యక్తికి చేరితే అతడూ ఈ వ్యాధి బారిన పడతాడు. ఒక్కోసారి వ్యాధిగ్రస్తుల ముక్కు స్రావాలు తమ చేతికి అంటిన వారు... అదే చేత్తో తలుపు గొళ్లెం తాకి వెళ్లాక... దాన్ని మరొకరు తాకితే... వారికి ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వైరస్ దాదాపు 2 -8 గంటల వరకు జీవించి ఉండి, వ్యాధిని వ్యాప్తి చేసేంత క్రియాశీలంగా ఉంటుంది. ఉదాహరణకు వ్యాధిగ్రస్తుడు తుమ్మినప్పుడు ఆ తుంపర్లు టేబుల్ మీద పడి, అక్కడ ఆరోగ్యవంతులెవరైనా చేతులు పెట్టి... వాటిని తమ ముక్కు, కళ్లు, నోటికి అంటించుకుంటే వ్యాధి వ్యాప్తి చెందుతుంది. తుమ్మే సమయంలో వ్యాధిగ్రస్తులు తమ చేతులు అడ్డుపెట్టుకుని, ఆ తర్వాత అదే చేత్తో వేరేవారికి షేక్‌హ్యాండ్ ఇస్తే... వైరస్ ఆరోగ్యవంతునికి వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్తులు లిఫ్ట్ వంటి క్లోజ్‌డ్ ప్రదేశాల్లోనూ, క్రౌడెడ్‌ప్రదేశాల్లో ఉన్నప్పుడూ, పబ్లిక్ ప్లేసెస్‌లో ఒకే బాత్‌రూమ్ తలుపును, కొళాయినాబ్‌ను వ్యాధిగ్రస్తులు తాకిన తర్వాత... ఆరోగ్యవంతులు అదే తలుపు హ్యాండిల్‌గాని, కొళాయి నాబ్‌ను తాకడం వల్ల ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉంది.


నిర్ధారణ...

అది సాధారణ ఫ్లూనా లేక స్వైన్‌ఫ్లూ (హెచ్1ఎన్1)నా అన్న విషయం నిర్ధారణ చేసుకోడానికి రోగి గొంతు నుంచి, ముక్కు నుంచి స్రావాలను సేకరించి, వాటిని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌కు పంపుతారు, అక్కడ పీసీఆర్ అనే పరీక్ష నిర్వహించి వ్యాధిని నిర్ధారణ చేస్తారు. అయితే ఫలితాలు వచ్చే వరకూ వేచి చూడాల్సిన అవసరం లేకుండానే లక్షణాలను బట్టే చికిత్స ప్రారంభిస్తారు. పరీక్షలో అది స్వైన్‌ఫ్లూ అని నిర్ధారణ అయితే వ్యాధి ఏ దేశంలో వ్యాపించినా, చికిత్సను అందించడానికి అంతర్జాతీయ సంస్థలు తమ వైద్యబృందాలతో ముందుకు వస్తాయి.

లక్షణాలివే...

 సాధారణ ఫ్లూ జ్వరంలో ఉండే లక్షణాలే ఈ వ్యాధిలోనూ కనిపిస్తాయి. అంటే... జ్వరం, దగ్గు, గొంతులో ఇన్ఫెక్షన్, ముక్కు కారడం, ఒంటి నొప్పులు, తలనొప్పి, చలి, అలసట, నీరసం, కళ్లు-ముక్కు ఎర్రబారడం, కడుపులో నొప్పి... లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలకు తోడు వాంతులు, విరేచనాలు కూడా కనిపించినప్పుడు వైద్యులు దాన్ని స్వైన్‌ఫ్లూగా అనుమానిస్తారు. ఈ వ్యాధి సోకినప్పుడు పిల్లల్లో, పెద్దల్లో కనిపించే లక్షణాలు కాస్తంత వేరుగా ఉంటాయి. అవి... పిల్లల్లో...  వేగంగా శ్వాసతీసుకోవడం, శ్వాసప్రక్రియలో ఇబ్బంది. కొందరిలో చర్మం నీలం రంగుకు మారడం. ఎక్కువగా నీళ్లు గానీ, ద్రవపదార్థాలుగానీ తాగకపోవడం.
     
► త్వరగా నిద్రలేవలేకపోవడం... ఎదుటివారితో సరిగా సంభాషించకపోవడం.
►  కోపం, చిరాకు వంటి భావోద్వేగాలకు త్వరగా గురికావడం.
►  ఫ్లూ వల్ల వచ్చిన జ్వరం తగ్గినా... దగ్గు ఒక పట్టాన త్వరగా తగ్గకపోవడం.
►  కొందరిలో జ్వరంతో పాటు ఒంటిపై దద్దుర్లు (ర్యాష్) కనిపించడం.

 పెద్దల్లో...     శ్వాసకియలో ఇబ్బంది, విపరీతమైన ఆయాసం.  ఛాతీలోపల లేదా పొట్టలో నొక్కేస్తున్నట్లుగా నొప్పిరావడం.  అకస్మాత్తుగా నీరసపడిపోవడం  అయోమయం  ఒక్కోసారి ఆగకుండా అదేపనిగా వాంతులు  ఫ్లూ కారణంగా వచ్చిన జ్వరం తగ్గినా... దగ్గు ఒక పట్టాన తగ్గకపోవడం.

హైరిస్క్ వ్యక్తులు...
 

65 ఏళ్లు పైబడినవారు, ఐదేళ్లలోపు పిల్లలు, గర్భిణులు, యుక్తవయస్కుల్లోనూ ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ వ్యాధి వ్యాపించడానికి అవకాశం ఉన్నవారిగా పరిగణిస్తారు. ఇక డయాబెటిస్, గుండెజబ్బులు, ఆస్తమా, సీఓపీడీ (క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్) లాంటి ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులున్నవారు, మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు, నరాల వ్యాధిగ్రస్తులు, ఎండోక్రైన్ వ్యవస్థలో లోపాలున్న వ్యాధిగ్రస్తులు, కాలేయ వ్యాధులు ఉన్నవారు, దీర్ఘకాలంగా ఆస్పిరిన్, స్టెరాయిడ్స్ వంటి మందులు తీసుకుంటున్న టీనేజర్స్, హెచ్‌ఐవీ వంటి వ్యాధులుండేవారు హైరిస్క్ గ్రూప్‌కి చెందినవారు.

వీరికి వచ్చే ఇతర వ్యాధులు...

స్వైన్‌ఫ్లూ వ్యాధిగ్రస్తులకు న్యుమోనియా, బ్రాంకైటిస్, సైనస్ ఇన్ఫెక్షన్, చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు తేలిగ్గా వస్తాయి. ఇలాంటివాళ్లు అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ఏఆర్‌డీఎస్) బారిన పడే అవకాశం ఉంది. అందుకే ఈ వ్యాధులను ఫ్లూ-రిలేటెడ్ కాంప్లికేషన్స్ అంటారు. ఉదాహరణకు ఆస్తమా ఉన్న వ్యక్తికిగానీ లేదా హార్ట్ ఫెయిల్యూర్ అయిన వ్యక్తికిగానీ స్వైన్ ఫ్లూ సోకితే అది మరింత ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది.

నివారణ ఇలా...

 ప్రస్తుతం ఈ వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తున్నందున చికిత్స కంటే నివారణ చాలా ముఖ్యం. పైగా వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపించే గుణమున్న ఈ వైరస్‌తో వ్యవహరించడం అన్నది అటు రోగుల తోటివారికీ, వైద్యులు, పారామెడికల్ సిబ్బందికీ రిస్క్ కాబట్టి నివారణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడం మేలు.

► దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు ఎదుటివారిపై తుంపర్లు పడకుండా చేతి రుమాలు అడ్డుపెట్టుకోవాలి. ఒకవేళ చేతి రుమాలు అందుబాటులో లేకపోతే... పొడవు చేతుల చొక్కా వేసుకొని, దాని మోచేతి మడతలో దగ్గడం, తుమ్మడం చేయడం వల్ల వైరస్ అక్కడికే పరిమితమవుతుంది.

► ఒకవేళ ఖాళీ చేతులు అడ్డు పెట్టుకొని దగ్గడమో, తుమ్మడమో చేస్తే ఆ తర్వాత ఆ చేతుల్ని శుభ్రంగా సబ్బుతో చాలాసేపు రుద్దుతూ కడుక్కోవాలి.

► ఒకవేళ రుద్ది కడుక్కునేందుకు సబ్బు లేదా నీరు అందుబాటులో లేకపోతే... ఆల్కహాల్ బేస్‌డ్ యాంటీ బ్యాక్టీరియల్ హ్యాండ్ రబ్స్‌తో చేతులను శుభ్రంగా రుద్దుకోవాలి.

►  దగ్గు, తుమ్ము సమయంలో రుమాలును లేదా టిష్యూ పేపర్‌ను ఉపయోగించవచ్చు. అయితే ఆ రుమాలునుగానీ/టిష్యూ పేపర్‌నుగానీ వేరొకరు ఉపయోగించకుండా, జాగ్రత్తగా ఎవరూ అంటుకోని ప్రదేశంలో దాన్ని పడేయాలి.

► జలుబు లేదా ఫ్లూ ఉన్న వ్యక్తులనుంచి దూరంగా ఉండాలి. ఇలాంటి రోగులు కూడా తమ లక్షణాలు తగ్గిన 24 గంటల వరకు అందరి నుంచి దూరంగా ఉండటం మంచిది. జలుబు లక్షణాలు కనిపించినా... అది తగ్గేవరకు పదిమంది మసిలే ప్రదేశాలకూ, ఆఫీసుకు వెళ్లడం సరికాదు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలి.

పరిసరాల పరిశుభ్రతతో నివారణ సులభం

మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మిగతా వ్యాధులతో పాటు స్వైన్‌ఫ్లూ నుంచి కూడా రక్షణ పొందవచ్చు. ఉదాహరణకు... మనం పనిచేసే డెస్క్, టేబుల్ ఉపరితలాన్ని, మన ఇంటి గచ్చును, కిచెన్, బాత్‌రూమ్ గచ్చులను క్లోరిన్, ఆల్కహాల్స్, పెరాక్సిజెన్, డిటెర్జెంట్స్, అయిడోఫార్స్, క్వాటెర్నరీ అమోనియం, ఫీనాలిక్ కాంపౌండ్స్ వంటి డిస్-ఇన్ఫెక్టెంట్‌లతో శుభ్రపరచుకోవాలి.

అందుబాటులో వ్యాక్సిన్...

మునుపు ఈ వ్యాధి వ్యాప్తి చెందినప్పుడు వ్యాక్సిన్ లేదు. కానీ తదుపరి పరిశోధనలతో స్వైన్‌ఫ్లూ వ్యాక్సిన్ రూపొందింది. ప్రస్తుతం అందుబాటులో ఉంది. స్వైన్ ఫ్లూ వచ్చేందుకు ఆస్కారం ఉన్న హైరిస్క్ గ్రూపునకు చెందిన వారంతా వ్యాక్సిన్ తీసుకోవాలని - సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ), అడ్వయిజరీ కమిటీ ఆన్ ఇమ్యూనైజేషన్ ప్రాక్టిసెస్ (ఏసీఐపీ) వంటి సంస్థలు సిఫార్సు చేస్తున్నాయి. అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) సిఫార్సుల మేరకు పదేళ్లు దాటిన వారంతా ఈ వ్యాక్సిన్‌ను తీసుకోవచ్చు. 6 నెలల నుంచి తొమ్మిదేళ్ల వయసున్న వారు రెండు డోసులు తీసుకోవాలి. ఈ రెండుడోసులకు మధ్య కనీసం నాలుగువారాల వ్యవధి ఉండాలన్నది ఎఫ్‌డీఏ సిఫార్సు.

చికిత్స...

ఫ్లూకు సంబంధించిన లక్షణాలు కనిపించగానే దాన్ని స్వైన్‌ఫ్లూగా అనుమానించి ఇష్టం వచ్చినట్లుగా యాంటీవైరల్ మందులు, ఇందుకోసం ఉద్దేశించిన ఒసెల్టామివిర్ (టామీఫ్లూ) లేదా జనామివిర్ అనే మందు ఉపయోగించడం సరికాదు. తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. సాధారణ ఫ్లూ లక్షణాలు కనిపించగానే విచక్షణరహితంగా టామిఫ్లూ వంటి మందులు వాడటం వల్ల అంత ప్రయోజనం లేదు. నిర్దిష్టంగా టామిఫ్లూ మందునే ఉపయోగించాల్సిన పరిస్థితి వస్తే డాక్టర్లు తమ విచక్షణతో ఆ విషయాన్ని నిర్ధారణ చేస్తారు. ఆసుపత్రిలో చేరిన వారికీ, ఒకవేళ ఆ మందులు ఇవ్వకపోతే పరిస్థితి దిగజారిపోయే ప్రమాదం ఉన్నవారికి మాత్రమే డాక్టర్లు ఆ మందులను ఇస్తారు. అలాంటి అవసరం ఉన్నవారికి ఒసెల్టామివిర్ (టామిఫ్లూ), జనామివిర్ లాంటి మందులను కాప్సూల్స్ రూపంలో 5 రోజుల కోర్సుగా ఇస్తారు. పిల్లలకు ఇదే మందును చాక్లెట్‌సిరప్‌తో కలిపి ఇస్తారు. ఇక కొందరిలో రెలెంజా వంటి పీల్చే యాంటీవైరల్ మందునూ ఇస్తారు. అయితే శ్వాససంబంధిత వ్యాధులు ఉన్నవారికి, గుండెజబ్బులు ఉన్నవారికి మాత్రం ఈ రెలెంజా వంటి పీల్చే మందులను ఇవ్వరు. ఎందుకంటే... అలాంటి వారికి పీల్చే మందు అయిన రెలెంజా ఇచ్చినప్పుడు మగతగా ఉండటం, ముఖం ఎముకల్లో ఉండే ఖాళీ ప్రదేశాలైన సైనస్‌లలో ఇన్ఫెక్షన్స్ రావడం (సైనుసైటిస్), ముక్కు కారడం లేదా ముక్కుదిబ్బడ వేయడం, దగ్గురావడం, కొందరిలో వికారం, వాంతులు, తలనొప్పి వంటి సైడ్‌ఎఫెక్ట్స్ కనిపించవచ్చు.

గర్భిణులకు చికిత్స...

వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే గర్భిణులకూ యాంటీరిట్రోవైరల్ మందులు ఇస్తారు. దీనివల్ల కడుపులో ఉన్న పుట్టబోయే బిడ్డపై దుష్ర్పభావాలు కలిగినట్లు ఎలాంటి దాఖలాలూ లేవు.అయితే లక్షణాల తీవ్రత ఎక్కువగా లేకుండా, ఇంటిదగ్గరే వైద్యచికిత్స తీసుకుంటున్నవారు మాత్రం సాధారణ యాంటీబయాటిక్స్‌ను వాడుకోవచ్చు. వ్యాధినిరోధకశక్తి ఎక్కువగా ఉన్న కొంతమందికి వైరస్ సోకినప్పటికీ... కొద్దిపాటి లక్షణాలు కనిపించి, ఎలాంటి మందులు వాడకపోయినా అది తగ్గిపోయే అవకాశమూ ఉంది.
 కాబట్టి ఈ సీజన్‌లో వ్యాధి సాధారణ జలుబులాగే అనిపించినప్పటికీ, డాక్టర్ సలహా మేరకు మందులు వాడటమే మంచిది.
 
చివరగా
: సాధారణ జలుబు లక్షణాలే కలిగి ఉండే కొందరిలో అసాధారణమైన ప్రమాదాన్ని తెచ్చిపెట్టే ప్రభావం స్వైన్‌ఫ్లూ వైరస్‌కు ఉంది కాబట్టి... చికిత్స వరకూ తెచ్చుకోకుండా ముందునుంచే నివారణ చర్యలు చేపట్టడం అటు ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు ఇటు వ్యాప్తినీ నివారిస్తుందని గుర్తుంచుకోండి.
 - నిర్వహణ: యాసీన్

డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి
కన్సల్టెంట్, ఇంటర్నల్ మెడిసిన్
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్
 హైదరాబాద్.

 

స్వైన్ ఫ్లూ... హోమియో చికిత్

హోమియో వైద్యవిధానంలో రోగలక్షణాలతోబాటు వ్యక్తిగత లక్షణాలను బట్టి మందును సూచిస్తారు. కాబట్టి స్వైన్ ఫ్లూ వ్యాధికి హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. హోమియో మందులు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. తద్వారా చికిత్సతోపాటు... నివారణ కోసం కూడా ఈ మందులను ఉపయోగించవచ్చు. ఈ వ్యాధి కోసం ఉపయోగించి మందుల్లో ముఖ్యమైనవి...

ఇన్‌ఫ్లుయెంజినమ్: ఇది ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్ ద్వారా తయారైన మందు. స్వైన్‌ఫ్లూ వ్యాధి నివారణిగా ప్రధానంగా వాడదగిన ఔషధం. ఫ్లూ లక్షణాలు, వ్యాధి తీవ్రతను తగ్గించడానికి సహాయపడుతుంది. ఒళ్లునొప్పులు, అలసట, గొంతునొప్పి, చలిజ్వరం, విరేచనాలు, వాంతులు మొదలైన ఫ్లూ జ్వర లక్షణాలకు ఇది చక్కగా పనిచేస్తుంది. ఇంతకుముందు వచ్చిన సాంక్రమిక వ్యాధుల వల్ల వచ్చే జ్వరం పూర్తిగా తగ్గనప్పుడు ఈ మందు బాగా పనిచేస్తుంది. మలవిసర్జన సమయంలో కడుపునొప్పి, మనోవ్యాకులత, మానసికంగా బాధపడటం, గనేరియా వ్యాధి చరిత్ర కలిగి ఉన్నవారికి ఇన్‌ఫ్లుయెంజినమ్ ఔషధం చక్కగా పనిచేస్తుంది.

జెల్సీమియం: నీరసం, మైకం, మగత ఈ ఔషధ లక్షణం. కండరాల నొప్పులు, నిరంతర చల్లదనం, అలసట, ఒళ్లునొప్పులు, దగ్గు తీవ్రంగా ఉండటం, హఠాత్తుగా వచ్చే తుమ్ములు, ముక్కు నుంచి స్రావం, చర్మం ఒరుసుకుపోయినట్లుగా అవడం, ఉదాసీనత వల్ల శ్వాస నెమ్మదిగా ఆడటం వంటి లక్షణాలు ఉన్నవారికి జెల్సీమియం చక్కగా పనిచేస్తుంది.

 బాప్టీషియా: ఫ్లూ జ్వరంతో పాటు జీర్ణాశయానికి సంబంధించిన లక్షణాలు ఉన్నట్లయితే బాప్టీషియా ప్రయోజనకరమైన ఔషధం. ముఖ్యంగా విరేచనాలు భరింపరాని, కుళ్లిన వాసన కలిగి ఉండటం, విశ్రాంతి తీసుకున్నా శరీరమంతా పుండులా అనిపించడం, బలహీనత, జ్వరం హఠాత్తుగా పెరగడం, ముఖం కమిలిపోవడం, శారీరక-మానసిక బలహీనత, శ్వాసతీసుకోవడం ఇబ్బంది, వీపు భాగంలో చలి, ద్రవపదార్థాలు తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉన్నవారికి బాప్టీషియా మందు చక్కగా పనిచేస్తుంది.
 ఆర్సినికం ఆల్బమ్: చలి, వేడి ఆవిర్లు, రొంప, తుమ్ములు, ముక్కు నుంచి స్రావాలు, ఆందోళన, భయం, దాహం, తరచూ నీళ్లు తాగాలనిపించడం, బలహీనత, ఏదైనా తిన్న లేదా తాగిన వెంటనే మలవిసర్జనకు వెళ్లాలనిపించడం, ఆహారం వాసన కూడా వికారం కలిగించడం, మంటతో కూడిన ఒళ్లునొప్పులు ఉన్నవారికి ఈ మందు చక్కగా పనిచేస్తుంది. ఆర్స్-ఆల్బ్ రోగులు వ్యాధి పట్ల భయం కలిగి ఉంటారు. వ్యాధి తమకే వస్తుందనే భయం, ఆందోళన, ఒక్కచోట కుదురుగా ఉండలేక అటు-ఇటు తిరగడం వంటి లక్షణాలు కలిగి ఉంటారు.

 రస్టాక్స్: ఫ్లూ జ్వరంతో పాటు విపరీతమైన ఒళ్లునొప్పులు, తుమ్ములు, దగ్గు (ముఖ్యంగా సాయంకాలం ఎక్కువగా ఉండటం), చల్లటి వాతావరణం, తేమ వాతావరణంలో బాధలు ఉద్రేకించడం, నీరసం, మాంద్యం, రోగికి టైఫాయిడ్ జ్వరాన్ని పోలిన లక్షణాలు ఉండటం, ముఖ్యంగా నాలుక మంట, మైకం, పిచ్చిగా మాట్లాడటం, రాత్రుళ్లు నిద్రపట్టకపోవడం, దగ్గు కారణంగా ఛాతీలో మంట, కొన్నిసార్లు అసంకల్పితంగా మూత్రవిసర్జన వంటి లక్షణాలు ఉన్నవారికి రస్టాక్స్ చాలా ప్రయోజనకరమైన ఔషధం.
 యుపటోరియం: శరీరమంతా పుండులా విపరీతమైన నొప్పి కలిగినవారికీ, శ్వాసనాళంతో పాటు గొంతు పుండులా మారి దగ్గు, గొంతుబొంగురుపోవడం, రొంపతో పాటు విపరీతమైన దాహం ఉండటం, అయినప్పటికీ ద్రవపదార్థాలు తీసుకుంటే వాంతులు కావడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు యుపటోరియం చక్కగా పనిచేస్తుంది.

 అకోనైట్: కొద్దిపాటి ఫ్లూ జ్వరం లక్షణాలు ముఖ్యంగా ముక్కు, కళ్ల నుంచి నీరు కారడం, ఇంకా ఏ ఇతర లక్షణాలు లేనప్పటికీ స్వైన్‌ఫ్లూ ఉందేమోనని ఆందోళన చెందిన రోగులకు అకోనైట్ వాడదగిన ఔషధం.

 డా. శ్రీకాంత్ మోర్లావర్, ఇకఈ
 హోమియోకేర్
 ఇంటర్‌నేషనల్

]]>
వ్యాధులు - నివారణ Tue, 20 Jan 2015 10:28:09 +0000
కిడ్నీలో రాళ్లు - హోమియో చికిత్స http://www.vijayawadaonline.com/health-care/802-kidney-stones-homeopathic-treatment.html http://www.vijayawadaonline.com/health-care/802-kidney-stones-homeopathic-treatment.html మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లకు సరైన చికిత్స అందించకపోతే వాటి పనితీరు మందగించి మూత్రపిండాలవ్యాధికి కారణమవుతాయి. దాంతో ఆరోగ్యం దిగజారుతుంది. సకాలంలో హోమియో చికిత్స అందిస్తేఈ సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు. 

కారణాలు: శారీరకశ్రమ తక్కువగా ఉండటం, తగినన్ని నీళ్లు తాగకపోవడం, కుటుంబచరిత్ర, స్థూలకాయం, మద్యపానం వంటివి ముఖ్యకారణాలు. ఇక దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, పుట్టుకనుంచి ఒకటే కిడ్నీ లేదా చిన్నకిడ్నీలు ఉండటం, పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ లాంటి వ్యాధులతో బాధపడేవారిలోనూ కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 

లక్షణాలు: తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రం తక్కువపరిమాణంలో రావడం, రక్తస్రావం వల్ల ఎరుపురంగులో మూత్రవిసర్జన కావడం, కడుపునొప్పి, వికారం, ఆకలి తగ్గడం, మలవిసర్జన అవుతున్నట్లుగా ఉండటం, అకస్మాత్తుగా లేదా తరచు వాంతులు, జ్వరం రావడం వంటివి జరుగుతాయి.

నివారణ: రోజూ శారీరక వ్యాయాయం, నడక, నాలుగు నుంచి ఐదు లీటర్ల మంచినీళ్లు తాగడం, మద్యపానానికి దూరంగా ఉండటం, ఆక్సిలేట్ ఎక్కువగా ఉండే పాలకూర, టొమాటో, సోయాబీన్, చాక్లెట్లను పరిమితంగా తీసుకోవడం ద్వారా స్టోన్స్ సమస్యను నివారించవచ్చు లేదా మరింత పెరగకుండా చేయవచ్చు.

చికిత్స: హోమియో వైద్యం ద్వారా వీటిని శాశ్వతంగా నయం చేయవచ్చు. ]]>
వ్యాధులు - నివారణ Tue, 23 Jul 2013 18:06:18 +0000
తరచు అలర్జీ, ఆయాసం, సైనస్..? http://www.vijayawadaonline.com/health-care/800-allergy-asthma-sinus.html http://www.vijayawadaonline.com/health-care/800-allergy-asthma-sinus.html నాలుగైదేళ్లుగా ఎలర్జీ, ఆయాసంతో బాధపడుతున్నాను. సైనస్ కూడా ఉంది. ఇది శాశ్వతంగా రాకుండా ఉండాలంటే ఆపరేషన్ చేయాలన్నారు. నా ఈ సమస్యలకు ఆయుర్వేదమందులు, సలహాలు సూచింప ప్రార్థన. అసలు ఇది మందులతో తగ్గుతుందా?

 

మీ బాధల్ని నియంత్రించుకోవడానికి ఎన్నో ఉపశమన మార్గాలుఉన్నాయి. మీరేమీ ఆందోళన చెందనవసరం లేదు. ఈ కింది మందులు వాడండి.

షడ్బిందుతైలం (ముక్కులో చుక్కల మందు): ఒక్కొక్క నాసికారంధ్రంలో రెండేసి చుక్కల చొప్పున, రెండుపూటలా వేసుకోవాలి.

హింగుకర్పూరవటి: ఈ మాత్రను నీటిలో అరగదీసి, ముద్దగా చేసి సైనస్ నొప్పి ఉన్నచోట పైపూతగా రాయండి.

నారదీయ లక్ష్మీవిలాసరస (మాత్రలు): ఉదయం 1, రాత్రి 1
పసుపు వేసిన వేడినీటితో ముక్కుకి, ముఖానికి ఆవిరి పట్టాలి. 
రెండుపూటలా ప్రాణాయామం చెయ్యాలి.

ఆయాసం: దీన్నే ఉబ్బసం (ఆస్త్మా) అంటారు. ఆయుర్వేదంలో ‘తమకశ్వాస’ అంటారు. మేఘావృత వాతావరణం, చల్లటి వాతావరణం, అసాత్మ్య ద్రవ్యాలు, దుమ్ముధూళి, కొన్నిరకాల వాసనలు, ఆహార పదార్థాలు మొదలైనవి ప్రధాన కారణాలు. వారసత్వం, మానసిక ఒత్తిడి వల్ల కూడా వస్తుంది. వయసు వల్ల, శరీరంలోని మార్పుల వల్ల, పరిస్థితుల మార్పు వల్ల ఈ వ్యాధి దానంతట అదే బలహీన పడుతుంది. ఈక్రింది మందుల వల్ల వ్యాధిని నియంత్రణలోకి తేవచ్చు.

శృంగారాభ్రరస (మాత్రలు): ఉదయం 1, రాత్రి 1, అగస్త్యహరీతకీ రసాయనం (లేహ్యం): ఉదయం 1 చెంచా, రాత్రి 1 చెంచా చప్పరించాలి. ఇవి ఆయాసం లేనప్పుడు కూడా వాడుకోవచ్చు. ఆయాసం ఉన్నప్పుడు: కనకాసవ లేదా సోమాసవ (ద్రావకం): 2-4 చెంచాల మందుకి సమానంగా గోరువెచ్చని నీళ్లు కలిపి రోజుకి 3 - 4 సార్లు తాగాలి.

నివారణ: వీలున్నంతవరకు వ్యాధి కారణాలకు దూరంగా ఉండాలి.

]]>
వ్యాధులు - నివారణ Tue, 23 Jul 2013 17:59:33 +0000
తలనొప్పిని వదిలించుకోండి http://www.vijayawadaonline.com/health-care/798-headache.html http://www.vijayawadaonline.com/health-care/798-headache.html ప్రైమరీ సెక్స్ హెడేక్ : సెక్స్‌లో పాల్గొన్నప్పుడు భావప్రాప్తి పొందే సమయంలో అకస్మాత్తుగా వచ్చే తలనొప్పి ఇది. సాధారణంగా పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎర్గాటమైన్ లేదా ఇండోమెథాసిన్ వంటి మందులను సెక్స్‌కు ముందు వాడటం ద్వారా ఈ తరహా తలనొప్పిని నివారించవచ్చు. ఇక దీర్ఘకాలం పాటు ఈ నొప్పి రాకుండా ఉండటానికి ప్రొప్రానలాల్, డిల్టియాజెమ్ వంటి మందులు ఉపయోగిస్తారు. 

ఈ ప్రపంచంలో ప్రతిఒక్కరూ తమ జీవితకాలంలో ఏదో ఒక సమయంలో గురయ్యే రుగ్మత తలనొప్పి. వీటిలో దాదాపు 200 రకాలు ఉన్నాయి. ప్రధానంగా రెండు రకాలను పేర్కొనవచ్చు. ప్రైమరీ తలనొప్పులు... ఇందులో నొప్పి, అందుకు కారణం తలలోనే ఉంటుంది. ఇక సెకండరీ తలనొప్పులు మరోరకం. ఇందులో మరేదో బయటి కారణంతో అంటే... తలలో గడ్డ లేదా తలకు గాయం కావడం లేదా పక్షవాతం వంటి బాహ్యకారణాల వల్ల తలనొప్పి వస్తుంది. 

తలనొప్పి ఏదైనా, కారణాన్ని కనుగొనడం కూడా పెద్ద తలనొప్పే అంటారు డాక్టర్లు. ఎందుకంటే కొన్నిరకాల తలనొప్పులకు కారణాలు సీటీ స్కాన్/ఎమ్మారై పరీక్షల్లో కూడా కనిపించవు. మనలో కనిపించే అనేకరకాల తలనొప్పులపై అవగాహన కోసం ఈ కథనం. తలనొప్పి చాలా సాధారణ సమస్యే అయినా కొన్నిరకాల్లో మాత్రం ఈ లక్షణం రోగికి తన విశ్వరూపం చూపించి తీవ్ర సమస్యగా పరిణమించవచ్చు. ఇలా తగ్గకుండా తలనొప్పి వస్తుండటం కొన్నిసార్లు ఇతరత్రా ఏదైనా తీవ్రమైన సమస్యకు సూచికగా భావించి, కారణాన్ని వెదకాలి.

సెకండరీ తలనొప్పులు:

ఇతరత్రా బాహ్య కారణాలతో వచ్చే వీటిని ముందుగా పరిశీలిద్దాం!
మెనింజైటిస్: ఇది మెదడు పొరల్లో ఒకదానికి వచ్చే ఇన్ఫెక్షన్. ఇందులో కనిపించే లక్షణాలు... తలనొప్పితో పాటు జ్వరం, వాంతులు, మెడ బిగుసుకుపోయి ఉండటం, వెలుగు చూడటానికి ఇబ్బందిగా ఉండటం లేదా శబ్దాలు వినడానికి ఇబ్బందిగా ఉండటం. మెనింజైటిస్‌ను సీఎస్‌ఎఫ్ (మెదడులోని సెరిబ్రోస్పినల్ ఫ్లూయిడ్)ను పరీక్షించడం ద్వారా నిర్ధారణ చేయవచ్చు. 

ఇంట్రాక్రేనియల్ హేమరేజ్: తల(పుర్రె)లో అంతర్గత రక్తస్రావం కావడం వల్ల వచ్చే తలనొప్పి ఇది. అకస్మాత్తుగా తలనొప్పి వచ్చి శరీరంలోని ఏదైనా అవయవం బలహీనంగా కావడం లేదా చచ్చుబడిపోయినట్లుగా కావడం జరుగుతుంది. ఒక్కోసారి మాట ముద్దముద్దగా రావడం వంటి మార్పులు కనిపించవచ్చు. దీన్ని సీటీస్కాన్ పరీక్షతో నిర్ధారణ చేయవచ్చు. బ్రెయిన్ ట్యూమర్స్: మెదడులో గడ్డలు ఏర్పడటం వల్ల తలనొప్పి వస్తుంది. ఇలా వచ్చే తలనొప్పి మెదడులోని గడ్డ పెరుగుతున్నకొద్దీ నొప్పి కూడా పెరుగుతూ, వారాల తరబడి కొనసాగుతుంది. నిద్రలేవగానే నొప్పి ఎక్కువగా ఉంటుంది. తలనొప్పితో పాటు వాంతులు ఉంటాయి. ఒక్కోసారి ఫిట్స్ కూడా రావచ్చు. ముందుకు వంగినప్పుడు తలనొప్పి ఎక్కువగా ఉంటుంది లేదా ఏదైనా వస్తువులను ఎత్తినప్పుడు తలనొప్పి పెరుగుతుంది. 

టెంపొరల్ ఆర్టిరైటిస్:

ఇది 60 ఏళ్ల వారిలో కనిపించే తలనొప్పి. ఆ వయసువారిలో మొదటిసారి కనిపించే తలనొప్పి ఇది. దీనితో పాటు జ్వరం, బరువు తగ్గడం, దవడ నొప్పి, ఏదైనా నములుతున్నప్పుడు నొప్పి రావడం, రాత్రుళ్లు నొప్పి ఎక్కువగా ఉండటం, కణతలు నొక్కుకున్నప్పుడు నొప్పి ఎక్కువగా ఉండటం వంటివి దీని లక్షణాలు. రక్తపరీక్ష చేయించినప్పుడు ఈఎస్‌ఆర్ చాలా ఎక్కువగా ఉంటే దీన్ని నిర్ధారణ చేస్తారు. 


గ్లకోమా: కంటిగుడ్డులో ఒత్తిడి పెరగడం వల్ల వస్తుందిది. ఇందులో తలనొప్పి, వికారం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. ఇది నెమ్మదిగా చూపును హరించివేస్తుంది. కాబట్టి వెంటనే వైద్యుని సంప్రదించాలి. 
ప్రైమరీ తలనొప్పులు: మెదడులోని జీవరసాయనాల్లో సమతౌల్యం లోపించడం వల్ల తలలోనే ఉద్భవించే తలనొప్పులివి. 

మైగ్రేన్: ఇది 15 శాతం యువతుల్లో, 6 శాతం యువకుల్లో వచ్చే సాధారణ సమస్య. తరచూ వచ్చిపోతుండే ఈ తలనొప్పి చాలా సందర్భాల్లో తలకు ఒకేవైపు రావడం, కొన్నిసార్లు ఇరుపక్కలా వస్తుండటంతో పాటు ఒక్కోసారి నాలుగు నుంచి 72 గంటల పాటు వేధిస్తుంది. తలనొప్పితో పాటు వికారం/ వాంతులు; కాంతిని చూసినా, శబ్దాలు విన్నా తలనొప్పి పెరగడం, నిద్రపడితే తగ్గడం వంటి లక్షణాలుంటాయి. 20 శాతం మందిలో చిత్రవిచిత్రమైన కాంతి వలయాలు, కాంతిపుంజాలు (జిగ్‌జాగ్ లైన్స్ ఆఫ్ లైట్స్) రూపంలోనూ కనిపిస్తాయి. 

ఇది తగినంత నిద్రలేకపోవడం, సమయానికి తినకుండా ఆకలితో ఉండటం, తీవ్రంగా శ్రమించి అలసటకు గురికావడం, వాతావరణంలో మార్పులు, అగరుబత్తి వంటి ఘాటైన వాసనలు, ఆల్కహాల్, చైనీస్ ఫుడ్ ఐటమ్స్, యువతుల్లో రుతుస్రావ సమయంలో హార్మోన్ల మార్పులు, ఎండకు ఒకేసారి ఎక్స్‌పోజ్ కావడం వంటి అంశాలు మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించడంతో పాటు మరింత తీవ్రతరం చేస్తాయి. అందుకే వీటిని మైగ్రేన్‌కు దోహదపడే అంశాలు (ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్)గా పేర్కొంటారు. తలనొప్పుల నిర్ధారణ కోసం చేసే పరీక్షల్లోనూ ఏ లోపం కనిపించదు. ఈ అంశంతో పాటు పై లక్షణాలన్నీ కనిపిస్తుండటం, మాటిమాటికీ తిరగబెడుతుండటం వంటి అంశాల ఆధారంగా దీన్ని నిర్ధారణ చేస్తారు. 

చికిత్స: దీనికి రెండు రకాల చికిత్స చేస్తారు. మొదట తీవ్రమైన తలనొప్పిని తక్షణం తగ్గించడానికి చేసే చికిత్స. ఇది సాధారణ నొప్పి నివారణ మందులతో తగ్గనప్పుడు, తక్షణం తలనొప్పిని తగ్గించడానికి రిజాట్రిప్టాన్ / అల్మోట్రిప్టాన్ వంటి ‘ట్రిప్టాన్స్’ వాడతారు. వీటిని తలనొప్పి మొదలయ్యాక ఎంత త్వరగా తీసుకుంటే అంత త్వరగా ఉపశమనం ఉంటుంది. ఒకవేళ ఈ మందు ఇచ్చాక రెండు గంటల్లో తలనొప్పి తగ్గకపోతే మళ్లీ మరో మోతాదు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మందులు (ట్రిప్టాన్స్) వాడేవారు రెండు డోసులు వాడినా తలనొప్పి తగ్గకపోతే అప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి. 

మళ్లీ రాకుండా నివారించడానికి

తక్షణం తగ్గడానికి తీసుకునే మందులతో పాటు సమస్య తిరగబెట్టకుండా ఉండటానికీ మందులు వాడాల్సి ఉంటుంది. వీటిని మూడు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం వాడాల్సి ఉంటుంది. టోపిరమేట్, డైవాల్ప్రోయేట్, ప్రొప్రానోలాల్, ఫ్లునారాజైన్ వంటి మందులతో మళ్లీ సమస్య రాకుండా నివారించవచ్చు. మందులతో పాటు యోగా, ధ్యానం వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ కూడా ఉపయోగపడతాయి. వీటితో తగ్గని మైగ్రేన్‌లకు బొటాక్స్ ఇంజెక్షన్‌ను వాడుతున్నారు. 

టెన్షన్ హెడేక్: తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నవారికి తలనొప్పిగా అది వ్యక్తం కావడం చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే. ఇది దీర్ఘకాలంగా వస్తూ, తలకు ఇరువైపులా ఉంటుంది. తలను గట్టిగా బిగించి కట్టినట్లుగా ఉండటం, తీవ్రతను బట్టి పెరుగుతుండటం, ఒక్కోసారి రోజులు, నెలల తరబడి కనిపించడం కూడా ఉంటుంది. సాధారణ తలనొప్పి మందులతో దీన్ని తగ్గించుకోవచ్చు. అమీట్రిప్టిలిన్ వంటి మందులు టెన్షన్ తలనొప్పిని తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. 

క్లస్టర్ హెడేక్: ఇది ఒకింత అరుదైన తలనొప్పి (కేవలం వేయిమందిలో వచ్చే వెయ్యి తలనొప్పుల్లో ఒకరికి మాత్రమే కనిపిస్తుంది). కంటిపాపల వెనక బాగా తీవ్రమైన నొప్పితో వస్తుంది. మూడుగంటల కంటే తక్కువ సేపు ఉంటుంది. ఒక్కోసారి కొద్దిరోజులపాటు తిరగబెడుతూ ఉంటుంది. అప్పుడది రోజూ ఒకేవేళకు కనిపిస్తూ ఉంటుంది. ఏడాదిలో 8-10 వారాల పాటు వస్తుంటుంది. ఒకసారి అలా వచ్చాక మళ్లీ ఏడాదిపాటు రాదు. ఇక ఆ తదుపరి ఏడాది మొదటిసారి వచ్చినట్లే మళ్లీ 8-10 వారాల పాటు అదే వేళకు కనిపిస్తూ ఉంటుంది. 

చికిత్స: దీనికి తక్షణ చికిత్సగా ఆక్సిజన్‌ను అందించడం లేదా ట్రిప్టాన్ మందులను ముక్కు ద్వారా పీల్చేలా చేస్తారు. దీనితో మొదట వచ్చే నొప్పిని తగ్గిస్తారు. ఇక దీర్ఘకాలికంగా ఈ తరహా తలనొప్పిని రాకుండా చేయడానికి లిథియమ్‌తో పాటు విరపామిల్ వందును ఉపయోగిస్తారు. క్రానిక్ డైలీ హెడేక్: దీర్ఘకాలం పాటు రోజూ వచ్చే మైగ్రేన్, టెన్షన్ తలనొప్పులను తగ్గించుకోడానికి తరచూ నొప్పి నివారణ మందులను వాడటం వల్ల వచ్చే తలనొప్పి ఇది. ఒక దశ తర్వాత నొప్పి నివారణ మందులు తీసుకోగానే ఈ తరహా తలనొప్పి వస్తుంటుంది. వీళ్లకు ఎర్గాటమైన్స్,

ఆన్‌డెన్‌సెట్రాన్ వంటి మందులు ఇచ్చి చికిత్స చేయాల్సి ఉంటుంది. 
ప్రైమరీ కాఫ్ హెడేక్: తీవ్రంగా దగ్గడం లేదా గట్టిగా చాలాసేపు నవ్వడం లేదా గట్టిగా తుమ్మడం వంటి చర్యల వల్ల అకస్మాత్తుగా వచ్చే తరహా తలనొప్పి ఇది. చాలా అరుదుగా ఇది తలలోని సెరిబ్రోస్పినల్ ఫ్లూయిడ్ వంటి ద్రవాలను అడ్డుకోవచ్చు. ఒక్కోసారి తలలోని రక్తనాళాలను అడ్డుకోవచ్చు. ఒక్కోసారి గుండె నుంచి మెడ ద్వారా తలలోకి రక్తాన్ని తీసుకెళ్లే కెరోటిడ్ ఆర్టరీ అనే మంచిరక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళం సన్నబడటం వల్ల కూడా ఈ తరహా తలనొప్పి రావచ్చు. 

హిప్నిక్ హెడేక్: నిద్రలోనే మొదలై దాదాపు 15-30 నిమిషాల పాటు ఉంటుంది. సాధారణంగా 60 ఏళ్లు దాటినవారిలో అందునా మరీ ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. నిద్రకు ఉపక్రమించే ముందు ఒక కాఫీ తాగడం లేదా లిథియమ్ మాత్రలు వంటివి ఈ తరహా తలనొప్పికి చికిత్స. 
తలనొప్పి వచ్చినప్పుడు ఆందోళన పడకుండా ఉండాలి. తరచూ తలనొప్పి అదేపనిగా మాటిమాటికీ వస్తుంటే డాక్టర్‌ను కలిసి కారణాన్ని కనుగొని దానికి అనుగుణంగా చికిత్స తీసుకోవాలి. 

ఏయే సందర్భాల్లో తలనొప్పిని తీవ్రంగా పరిగణించాలి? 
జీవితంలో మొట్టమొదటి తీవ్రమైన తలనొప్పి రావడం రావడమే చాలా తీవ్రవేదన కలిగించేంత తీవ్రంగా తలనొప్పి ఉండటం వారాలు గడుస్తున్నా తగ్గకుండా తీవ్రత అంతకంతకూ పెరుగుతూ పోతున్నప్పుడు తలనొప్పితో పాటు జ్వరం/నీరసం /ఫిట్స్ /క్యాన్సర్ /కళ్లు మసకగా మారడం వంటి ఇతర లక్షణాలూ జోడైనప్పుడు పైకి లేస్తున్నప్పుడు లేదా ఏదైనా వస్తువును ఎత్తుతున్నప్పుడు లేదా ముందుకు వంగుతున్నప్పుడు నిద్రాభంగం కలిగిస్తున్నప్పుడు... పైనపేర్కొన్న అంశాలు కనిపిస్తున్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించి సీటీ స్కాన్/ఎమ్మారై స్కాన్ అవసరాన్ని బట్టి మెదడు నుంచి నీరు తీసి చేసే సీఎస్‌ఎఫ్ పరీక్ష వంటివి చేయాలి. ఆ పరీక్షలు చేసి తలలో రక్తస్రావం/గడ్డ/ఇన్ఫెక్షన్ లేదని నిర్ధారణ చేసుకోవాలి. 

మైగ్రేన్ కొన్ని ఆసక్తికరమైన అంశాలు
తలనొప్పికి చికిత్స చేసే న్యూరాలజిస్టుల్లోనూ 70 శాతం మందికి మైగ్రేన్‌తో బాధపడుతున్నవారే సెరీనా విలియమ్స్ బాగా చెమటోడ్చి ఆడిన ప్రతిసారీ మైగ్రేన్‌తో బాధపడుతుంటుంది జూలియస్ సీజర్, నెపోలియన్, సిగ్మండ్ ఫ్రాయిడ్, ఎలిజబెత్ టేలర్, ఎల్విస్ ప్రెస్లీ వంటి ప్రముఖులు మైగ్రేన్‌తో బాధపడినవారే.

]]>
వ్యాధులు - నివారణ Wed, 17 Jul 2013 15:26:49 +0000
యూరినరీ ఇన్ఫెక్షన్స్... హోమియో చికిత్స http://www.vijayawadaonline.com/health-care/774-urinary-infection-homeopathy.html http://www.vijayawadaonline.com/health-care/774-urinary-infection-homeopathy.html శరీరంలోని రక్తాన్ని వడపోసి, మలినాలను బయటకు పంపించే పని మూత్రపిండాలది. రక్తంలోని జీవరసాయన వ్యర్థాలను, శరీరానికి అవసరం లేని పదార్థాలను మూత్రపిండాలు వడగట్టి, రక్తం నుంచి వాటిని వేరుచేస్తాయి. మూత్రం ద్వారా ఇవి బయటకు విసర్జితమవుతాయి. శరీరంలోని ఎక్కువభాగం రక్తం గుండెనుంచి వెలువడిన వెంటనే మూత్రపిండాల ద్వారా వెళ్తుంది. కాబట్టి రక్తప్రవాహం వల్ల కలిగే ఒత్తిడిని మూత్రపిండాలూ ఎదుర్కొంటాయి. కాబట్టే రక్తపోటు మితిమీరినప్పుడు మూత్రపిండాలు చెడిపోయే అవకాశం ఎక్కువ. 

సాధారణంగా మూత్రం... బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులేవీ లేకుండా ఉంటుంది. అయితే మూత్రంలో ఉండే గ్లూకోజ్ వల్లగాని, ఇతర ఖనిజాల వల్లగాని బ్యాక్టీరియా చేరితే మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్స్ వచ్చేందుకు అవకాశం ఎక్కువ. అందుకే చక్కెరవ్యాధి ఉన్నవారికి మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్స్‌కు ఆస్కారం ఎక్కువ. ఇక పురుషుల్లో మూత్రనాళం అన్నది పురుషాంగం ద్వారా ప్రయాణిస్తే, మహిళలకు ఇది యోని లోపలే తెరచుకుంటుంది. అందుకే పురుషులతో పోలిస్తే మహిళల్లో యూరినరీ ఇన్ఫెక్షన్లు వచ్చేందుకు అవకాశం ఎక్కువ. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రతి ఐదుగురు మహిళల్లో కనీసం ఒకరు తమ జీవితకాలంలో ఒకసారైనా తప్పక మూత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్స్‌తో బాధపడతారు.

యూరినరీ ఇన్ఫెక్షన్లకు కారణం... 

సాధారణంగా మూత్రవ్యవస్థలో వ్యాధులు రావడానికి బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, మరికొన్ని ఇతర పరాన్నజీవులు కారణమవుతుంటాయి. ఇందులోనూ సాధారణంగా బ్యాక్టీరియా వల్ల మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. వీటిని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్‌గా చెబుతారు. 

సాధారణంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఒకసారి వస్తే తరచూ తిరగబెడుతుంటాయి. సంతాననిరోధక సాధనంగా డయాఫ్రమ్ వాడే మహిళల్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా కనిపించడం మామూలే. అలాగే మెనోపాజ్ దశకు చేరుకున్న మహిళల్లో ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల యోనిగోడలు, మూత్రాశయపు కిందిభాగం, మూత్రనాళ ప్రవేశద్వారం పలుచగా తయారై మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్స్ వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. 

పురుషుల్లో 50 ఏళ్లు దాటాక మూత్రసంబంధమైన వ్యాధులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వయసు పెరిగేకొద్దీ ప్రోస్టేట్ గ్రంథి పెరగడం ఒక కారణమైతే, ఆహారంలో మసాలాలు, మద్యం, కాఫీ వంటి వాటివల్ల కూడా మూత్రవిసర్జన సమయంలో మంట వచ్చే అవకాశం ఉంది. నైలాన్‌తో తయారుచేసిన అండర్‌వేర్స్ వల్ల కూడా కొందరిలో మూత్రవిసర్జన సమయంలో మంట రావచ్చు. 

హోమియో చికిత్స: అన్ని పరీక్షలు కూలంకషంగా నిర్వహించి మంట అన్నది మూత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్ వల్లనా లేక కిడ్నీలో రాళ్లు, కిడ్నీ వాపు, ఇతరత్రా కిడ్నీ సమస్యల వల్లనా అన్నది నిర్ధారణ చేసిన తర్వాతనే చికిత్స అందించాల్సి ఉంటుంది. హోమియోలో ఎపిస్, క్యాంథరిస్, నేట్రంమూర్, కెన్నబిస్, సబల్ సెర్యులేటా, సాలిడాగో, ఆర్స్ ఆల్బ్ వంటి మందులు మంచి ఫలితాలను ఇస్తాయి. - See more at: http://www.sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=65291&Categoryid=11&subcatid=20#sthash.WYbgUZtn.dpuf]]>
వ్యాధులు - నివారణ Tue, 09 Jul 2013 19:28:56 +0000
మానసిక సమస్యల వల్ల థైరాయిడ్ సమస్య తలెత్తవచ్చు http://www.vijayawadaonline.com/health-care/750-thyroid.html http://www.vijayawadaonline.com/health-care/750-thyroid.html థైరాయిడ్ గ్రంథిలో కొన్నిరకాల కారణాల వల్ల హైపో మరియు హైపర్ థైరాయిడిజమ్ వంటివి రావచ్చు. అంటే వారసత్వంగా కాని లేదా ఏదైనా మానసిక ఒత్తిడి, ఆందోళనల వలన, థైరాయిడ్ గ్రంథిలో ఉండే హార్మోన్ల ఉత్పత్తి సరిగ్గా ఉండదు. అంటే T3,T4 హార్మోన్లు ఎక్కువ లేదా తక్కువ మొత్తంలో ఉత్పత్తి అవ్వటం జరుగుతుంది. ఒక్కొక్కసారి థైరాయిడ్ గ్రంథిలో చిన్నచిన్న కాయలు లాంటివి ఏర్పడి, అవి కాన్సర్‌లా కూడా మారవచ్చు. ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథిలో వచ్చిన లోపాల వల్ల, మానసిక, శారీరక ఎదుగుదల సమస్యలు తలెత్తడంతోపాటు, అవయవాల పనితీరు దెబ్బతినడం జరుగుతుంది. 

ఈ పైన చెప్పిన లక్షణాలు అన్ని కూడా థైరాయిడ్ గ్రంథిలో వచ్చే అసమతుల్యత వల్ల శరీరంలో ప్రతి ప్రక్రియ కూడా భాగం అవటం వల్ల ప్రతి అవయవంలోనూ విభేదం రావటం జరుగుతుంది.

అంతే కాకుండా ఆడవాళ్ళలో నెలసరి సమస్యలతో పాటు ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథిలో వచ్చిన లోపం వల్ల, మానసిక ఎదుగుదల మరియు మానసిక లోపాలు కూడా ఎక్కువగా గమనిస్తూ ఉంటాము.

హైపర్ థైరాయిడిజమ్ వల్ల వచ్చే మానసిక సమస్యలు
సాధారణంగా మానసిక ఒత్తిడి, ఆందోళనల వలన హైపర్ థైరాయిడిజమ్ రావచ్చు.
1) ఎక్కువగా ఆందోళన పడటం 
2) ప్రతి చిన్న విషయానికి భయపడటం 
3) ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా రియాక్ట్ అవుతుంటారు. 
4) శబ్దాలను భరించలేరు. 
5) ఆత్మనూన్యతకు లోనవుతుంటారు.

ఈ థైరాయిడ్ గ్రంథి వల్ల వచ్చే మానసిక సమస్యలను చికిత్స లేకుండా విడిచిపెట్టేస్తే ‘థైరాయిడ్ క్రైసిస్’ లాంటివి రావచ్చు. అంటే మానసిక లక్షణాలు ఇంకా ఎక్కువ రావటం, జ్వరం లేదా తనలో తాను అదే పనిగా మాట్లాడుకోవటం వంటివి కనిపిస్తూంటాయి.

హైపర్ థైరాయిడిజమ్ లక్షణాలు
1) కంగారు పడటం 
2) చిరాకు 
3) చెమటలు ఎక్కువ పట్టడం
4) గుండెదడ 
5)చేతులు వణకడం 
6) ఆందోళన 
7)నిద్రలేమి 
8) చర్మం పొడిబారడం,
9) జుట్టు రాలడం
10) విరేచనాలు
11) బరువు తగ్గిపోవడం
12) వేడిని తట్టుకోలేక పోవటం
13) ఆకలి పెరగటం
14) యూరిన్ ఎక్కువసార్లు అవ్వటం 
15) నెలసరులు సరిగ్గా రాకపోవటం
16) కంటి చుట్టూ ఉండే కండరాలు బలహీనపడటం జరుగుతుంది.

హైపో థైరాయిడిజమ్ లక్షణాలు
థైరాయిడ్ హార్మోన్లు తక్కువ మొత్తంలో ఉత్పత్తి అవ్వటం జరుగుతుంది.

ఆడవాళ్ళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

best-horoscope.com and Leo, fall in Aries. font-style: normal; font-variant: normal; font-weight: normal; letter-spacing: normal; line-height: 15px; text-align: start; text-indent: 0px; text-transform: none; white-space: normal; word-spacing: 0px; background-color: #ffffff; display: inline ! important; float: none">అతిగా బరువు పెరగటం, నెలసరి సమస్యల వల్ల చాలా త్వరితంగా ఈ పరిస్థితిని గుర్తించవచ్చు.

లక్షణాలు
1) అలసట 
2) ఆయాసం మరియు మానసికంగా ఆత్మనూన్యతకు లోనవటం 
3) చలిని తట్టుకోలేకపోవటం 
4) మలబద్దకం 5) జుట్టు మరియు చర్మం పొడిబారటం 
6) ఏకాగ్రత తగ్గిపోవటం
7) శరీరం అంతా నొప్పులు 
8) కాళ్ళు వాపులకు గురవటం
9) కంటి చుట్టూ వాపులు రావటం 
10) నెలసరులు సరిగ్గా రాకపోవటం అంటే అధిక రక్తస్రావం లేదా నెలసరులు పూర్తిగా రాకపోవటం
11) బరువు అకారణంగా పెరగటం.

హైపో థైరాయిడిజమ్ వల్ల వచ్చే మానసిక సమస్యలు:
1) మానసిక ఎదుగుదలలో లోపాలు 
2) ఆసక్తి తగ్గిపోవటం 
3) విషయాలు సరిగ్గా గుర్తుండక, జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. 
4) ఆలోచనా శక్తి కూడా తగ్గిపోతుంది.

ముఖ్యంగా ఆత్మనూన్యత హైపోథైరాయిడిజమ్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే శారీరకంగా కూడా అధిక బరువు వల్ల అందరిలాగా ప్రతి పనిలో పాల్గొనక పోవటం మరియు ఏకాగ్రత, ఆలోచనా శక్తి తగ్గిపోవటం వలన, చదువులో వెనకబడటం. జరుగుతుంది.దీనివలన నలుగురిలో కలవలేక వెనకబడటం జరుగుతుంది.

థైరాయిడ్ గ్రంథి అనేది శరీరంలో అతి పెద్దది. ఇది ముఖ్యంగా మెడ భాగంలో, థైరాయిడ్ కార్టిలేజ్ కింద ఉంటుంది. జీవ ప్రక్రియలు అన్నింటికి ఇది అతి ముఖ్యమైన గ్రంథి. శరీరంలో ఉండే అతి ముఖ్యమైన కొన్ని అవయవాలు కూడా థైరాయిడ్ గ్రంధి కంట్రోల్‌లో ఉంటాయి.

థైరాయిడ్ గ్రంథి ముఖ్యంగా 3 రకాలైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. 1)థైరాక్సిన్ (ఖీ3), 2) టైఐడో థైరోనిన్ (ఖీ4) , 3)కాల్సిటోనిన్. ఈ కాల్సిటోనిన్ శరీంలో సరైన మొత్తంలో కాల్షియంను ఉత్పత్తి అయ్యేలా చూస్తుంది.

ఏది ఏమైనా హైపో మరియు హైపర్ థైరాయిడిజమ్ మూలంగా మానసికంగా పేషెంట్లు ఎక్కువగా బాధపడటం వల్ల, థైరాయిడ్ లెవల్స్ మరీ ఎక్కువ లేదా తక్కువ అవటం జరుగుతుంది. పాజిటివ్ హోమియోపతిలో ఈ మానసిక సమస్యలకు అనుగుణంగా, పేషెంట్ తత్వాన్ని బట్టి, మూలకారణాన్ని ఎనలైజ్ చేసుకుని, ‘జెనిటిక్ కానిస్టిట్యూషనల్ సిమిలిమమ్’ అనే పద్ధతి ద్వారా మందులు ఇచ్చి పూర్తి స్థాయిలో పరిష్కారం ఇవ్వటం జరుగుతుంది. ]]>
వ్యాధులు - నివారణ Thu, 04 Jul 2013 19:44:48 +0000
మైగ్రేన్ (పార్శ్వపు తలనొప్పి) http://www.vijayawadaonline.com/health-care/749-migraine-headache.html http://www.vijayawadaonline.com/health-care/749-migraine-headache.html
పార్శ్వపు తలనొప్పికి కారణాలు:

పార్శ్వపు తలనొప్పికి ముఖ్యకారణం మానసిక ఆందోళన, మానసిక ఒత్తిడి. అనవసరపు ఆలోచనలు, జరిగిపోయిన విషయాలను తరచుగా ఆలోచించడం వల్ల వస్తుంది.

డిప్రెషన్, నిద్రలేమి వల్ల వస్తుంది.

కొంతమంది బయటకు వెళ్లినప్పుడు, సూర్యరశ్మి ద్వారా తలనొప్పి వస్తుంది.

అధికంగా ప్రయాణాలు చేయడం వల్ల వస్తుంది.

స్త్రీలలో హార్మోన్ల సమస్యలు ఏర్పడినప్పుడు వస్తుంది. ఋతుచక్రం ముందు గాని, తర్వాత గాని వచ్చే అవకాశం ఉంటుంది. గర్భధారణ సమయంలో, స్త్రీలలో ఋతుచక్రం ఆగిపోయినపుడు, ఈ సమస్య తీవ్రంగా వచ్చే అవకాశం ఉంటుంది.

కొన్ని రకాల మందులు "oral contraceptive pills'వాడినప్పుడు ఎక్కువగా వస్తుంది.

మైగ్రేన్ దశలు - లక్షణాలు:

చాలా వరకు మైగ్రేన్ దానంతటదే తగ్గిపోతుంది. సాధారణంగా 24 గంటల నుండి 72 గంటలు ఉన్నట్లయితేStatus Migrainosus అంటారు.

మైగ్రేన్ నొప్పి 4 దశలలో సాగుతుంది

ప్రాడ్రోమ్ ఫేస్: ఇది నొప్పికి ముందు 2గం॥నుండి 2 రోజుల ముందు జరిగే ప్రక్రియ సమూహం. ఈ దశలో చిరాకు, మానసిక ఆందోళన, డిప్రెషన్, ఆలోచనలో మార్పులు రావడం, వాసన, వెలుతురు పడకపోవడం, మెడనొప్పి ఉంటాయి.

ఆరపేస్: ఈ దశ నొప్పి మొదలయ్యే కొద్ది నిమిషాల ముందు ఉంటుంది. దృష్టిలో చూపు కాస్త మందగించినట్లవడం, చూపులోZigzag lines రావడం, తలలో సూదులతో గుచ్చినట్లవడం, మాటలు తడబడటం, కాళ్లలో నీరసం ఉండటం ఉంటుంది.

నొప్పి దశ: ఈ నొప్పి దశ 2గం.ల నుండి 3 రోజుల వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఈ దశలో వాంతు లు ఉంటాయి. చాలావరకు ఒకవైపునే ఉంటుంది. కాంతికి, ధ్వనికి వారు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు.

పోస్ట్ డ్రోమ్ ఫేస్: నొప్పి తగ్గిన తర్వాత, కొద్దిరోజుల వరకు తల భారంగా ఉండటం, నీరసంగా ఉండటం, శ్రద్ధలేకుండా ఉండటం జరుగుతుంది.

వ్యాధి నిర్ధారణ:
రక్త పరీక్షలు - CBP, ESR

రక్తపోటును గమనించడం

EEGపరీక్ష

సి.టి. స్కాన్ (మెదడు)

MRIమెదడు పరీక్షలు ఉపకరిస్తాయి

మైగ్రేన్ తలనొప్పి రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు...

మానసిక ఆందోళన తగ్గించుకోవాలి.

అతిగా ఆలోచనలు చేయకూడదు.

మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. దీని కోసం, యోగా, ప్రాణాయామం చేయాలి. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది.

తలకు నూనెతో మసాజ్ చేయించుకోవాలి. తలలోని నరాలు రిలాక్స్ అవుతాయి.

తలనొప్పి వచ్చినప్పుడు ప్రశాంత వాతావరణంలో, లైటు తీసేసి నిశ్శబ్దంగా ఉన్నచోట పడుకోబెట్టాలి.

హోమియో వైద్యం:

మైగ్రేన్ తలనొప్పికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. తలనొప్పి... ఘాటైన వాసనలు పీల్చినప్పుడు వస్తే, బెల్లడోనా, లైకోపోడియం, ఇగ్నీషియా ఇవ్వాలి. తరచు తలనొప్పి అధికంగా వస్తే - నేట్రమూర్, సాంగ్యునేరియా, చైనా, సెపియా ఇవ్వాలి. గర్భవతుల్లో తలనొప్పి వస్తే బెల్లడోనా, నక్స్‌వామికా, సెపియా ఇవ్వాలి. ఎక్కువగా చదవడం వల్ల వస్తే కాల్కేరియా కార్బ్, నేట్రమ్ మూర్, ట్యుబర్కులినమ్ ఇవ్వాలి. ప్రయాణాల వల్ల తలనొప్పి వస్తే - ఇగ్నీషియా, సెపియా, కాక్యులస్, కాలికార్బ్ ఇవ్వాలి. స్కూల్‌కి వెళ్లే ఆడపిల్లలలో వస్తే - కాల్కేరియాఫాస్, నేట్రమ్‌మూర్, పల్సటిల్లా ఇవ్వాలి. పైన తెలిపిన మందులు కేవలం అవగాహనకు మాత్రమే. మందులను నిష్ణాతులైన హోమియో డాక్టర్‌ని సంప్రదించి తీసుకోవాలి.]]>
వ్యాధులు - నివారణ Thu, 04 Jul 2013 18:40:52 +0000
వర్షాలతో పాటు వచ్చే వ్యాధులు - నివారణ http://www.vijayawadaonline.com/health-care/388-atisara-dengue-malaria-japanese-encephalitis.html http://www.vijayawadaonline.com/health-care/388-atisara-dengue-malaria-japanese-encephalitis.html
వాతావరణ మార్పుల వల్ల ఎన్నో వ్యాధులు సంక్రమిస్తుంటాయి. వర్షాకాలంలో తాగునీరు కలుషితం అవుతుంది. దోమలు విజృంభిస్తాయి. దీనివల్ల డెంగ్యూలాంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు తొందరగా అంటువ్యాధులు, విషజ్వరాల బారినపడుతుంటారు. వర్షాకాలంలో ఎక్కువగా అతిసార, డెంగ్యూ, మలేరియా, జపనీస్ ఎన్‌కెఫలైటిస్, జాండిస్ వంటి ప్రాణాంతక వ్యాధులు చుట్టుముడుతుంటాయి. చిన్న పిల్లలు న్యుమోనియా, బ్రాంకైటిస్ బారినపడుతుంటారు.

చెవిలో ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. రెండేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, గర్భిణిలు, వయసు పైబడిన వారు అతిసారం బారినపడితే తొందరగా డీహైడ్రేషన్‌కు గురవుతారు. రెండు రోజులకు మించి జ్వరం, వాంతులు ఉన్నట్లయితే వెంటనే డాక్టర్‌ని కలిసి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే ఒక్కోసారి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది.

అతిసారం
కలుషిత ఆహారం, నీరు తీసుకోవడం వల్ల అతిసారం వ్యాపిస్తుంది. జ్వరం, విరేచనాలు, కడుపునొప్పి, రక్తపోటు పడిపోవడం వంటి లక్షణాలు అతిసారం సోకినపుడు కనిపిస్తాయి. తగిన చికిత్స సమయంలో అందించకపోతే మూత్రపిండాలు చెడిపోవడం కూడా జరుగుతుంది. డీహైడ్రేషన్ వల్ల మనిషి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇటువంటి సమయంలో వీలైనంత త్వరగా డీహైడ్రేషన్‌కు లోనయిన వ్యక్తికి చికిత్స అందించాల్సి ఉంటుంది. కొబ్బరినీరు, ఎలక్ట్రాల్ పౌడర్, ఇన్‌ఫెక్షన్లు ఉంటే యాంటీబయోటిక్స్ వాడాల్సి వస్తుంది. సపోర్టివ్ కేర్ అందిస్తే త్వరగా కోలుకుంటారు.

డెంగ్యూ
ఈ వ్యాధి దోమ కాటు వల్ల వస్తుంది. ముఖ్యంగా పగటి పూట కుట్టే దోమల వల్ల డెంగ్యూ విస్తరిస్తుంది. జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు డెంగ్యూ బారిన పడిన వ్యక్తిలో ఉంటాయి. రెండు మూడు రోజుల తరువాత శరీరంపైన రాషెస్ కనిపిస్తాయి. మూడునాలుగు రోజుల తరువాత ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గిపోతుంది. చికిత్స తీసుకోకపోతే జాండిస్, ఊపిరితిత్తులో ఇన్‌ఫెక్షన్, కిడ్నీ ఫెయిల్యూర్, హెపటైటిస్ వచ్చే అవకాశం ఉంది.

డెంగ్యూ బారినపడిన వ్యక్తికి మొదట ఫ్లూయిడ్స్ ఎక్కించాలి. ఈ వ్యాధి చికిత్సలో యాంటిబయోటిక్స్ పాత్ర ఎక్కువగా ఉండదు. 20 వేల కంటే తక్కువ స్థాయికి ప్లేట్‌లెట్స్ పడిపోయినపుడు ప్లేట్‌లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది. రక్తపోటు పడిపోతే వెంటిలేటర్ సపోర్టు అవసరం అవుతుంది. సపోర్టివ్ కేర్ ద్వారా రోగి కోలుకునేలా చేయవచ్చు. డెంగ్యూ బారిన పడి వ్యక్తికి ఇతర అవయవాలకు ఇన్‌ఫెక్షన్లు సోకనట్లయితే కోలుకున్న తరువాత ఐదారు రోజుల్లో ప్లేట్‌లెట్ల సంఖ్య దానంతట అదే సాధారణ స్థాయికి చేరుకుంటుంది.

మలేరియా
వర్షాకాలంలో ఎక్కువ మంది మలేరియా బారినపడుతుంటారు. ఇది కూడా దోమల వల్లనే వ్యాప్తి చెందుతుంది. జ్వరం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి. గ్రామాలలో చాలా మంది జ్వరం రాగానే పారసిటామల్ లాంటి మాత్రలు వేసుకుని తగ్గిపోతుందిలే అనుకుంటారు. కానీ మలేరియా జ్వరం సాధారణ మందులు వాడటం వల్ల తగ్గదు. యాంటీ మలేరియల్ డ్రగ్స్ వాడాల్సి ఉంటుంది. జ్వరం విడవకుండా ఉన్నప్పుడు వెంటనే వైద్యున్ని కలిసి తగిన చికిత్స తీసుకుంటే పరిస్థితి విషమించకుండా ఉంటుంది.

జపనీస్ ఎన్‌కెఫలైటిస్
ఇది ఎక్కువగా పిల్లలలో వస్తుంది. ఇది కూడా దోమ కాటు వల్లనే సోకుతుంది. దీన్ని మెదడు వాపు వ్యాధి అని కూడా అంటారు. జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. సిట్ స్కాన్, సిఎస్ఎఫ్ అనాలసిస్ పరీక్షల ద్వారా వ్యాధిని గుర్తించవచ్చు. ఈ వ్యాధికి ప్రత్యేకమైన చికిత్స ఏమీ లేదు. సపోర్టివ్ కేర్ ద్వారానే వ్యాధిని తగ్గించాల్సి ఉంటుంది. ఒకవేళ మెదడు వాపు ఎక్కువైతే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి జ్వరం వచ్చిన వెంటనే తగిన పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు.

నివారణ
ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు వృద్ధి చెందకుండా చూసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఈగలు వాలడానికి అవకాశం ఉన్న ప్రాంతాలలోని ఆహారం తినకూడదు. భోజనానికి ముందు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. జ్వరం వస్తే వెంటనే చికిత్స తీసుకోవాలి. పిల్లలు వానలో తడవటం మూలంగా జలుబు తద్వారా జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు వర్షంలో తడవకుండా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వర్షాకాలంలో వచ్చే వ్యాధులు మీ దరిచేరవు.]]>
వ్యాధులు - నివారణ Wed, 11 Jul 2012 20:26:53 +0000
మోకాళ్ల నొప్పులు http://www.vijayawadaonline.com/health-care/303-mokalla-noppulu.html http://www.vijayawadaonline.com/health-care/303-mokalla-noppulu.html
మోకాళ్లనొప్పి... కారణాలు:
మోకాలి జాయింట్ కింద ఉండే ఎముకల్లో పటుత్వం తగ్గడం లేదా అరిగిపోవడం కొన్ని సందర్భాల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్, బోన్ మ్యారో క్యాన్సర్ వంటి జబ్బులు ప్రమాదాల్లో మోకాళ్లకు తీవ్ర గాయాలు కావడం స్థూలకాయం కారణంగా మోకాళ్లపై అదనపు బరువు పడటం వల్ల మోకాలి ఎముకలు త్వరగా అరుగుదలకు గురికావడం ఆధునిక జీవనశైలి వల్ల మోకాళ్లకు తగిన వ్యాయామం లేకపోవడం ఆధునిక జీవనశైలి వల్ల ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాల వినియోగం అధికం కావడంతో ఇటీవల తరచూ గౌట్ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఎక్కువగా పెరగడం.

పైన పేర్కొన్న కారణాలతో మోకాళ్ల నొప్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాధారణంగా ఎముక చివరన ఉండే కణాలు ప్రతి 40 రోజులకు ఒకసారి చనిపోయి ఆ ప్రాంతంలో కొత్త కణాలు పుడతాయి. అయితే ఆస్టియో ఆర్థరైటిస్ అనే జబ్బు ఉన్నవారిలో జబ్బు ఉన్నచోట కణాలు పుట్టవు. కానీ జబ్బు లేనిచోట కణాలు online casinos పెరుగుతాయి. ఫలితంగా కణాలు అసమానంగా పెరగడం... పెరిగిన చోట కణాలు ఒరిపిడికి గురి కావడం, ఫలితంగా ఒరిపిడి కలిగిన చోట నొప్పి కలగటం జరుగుతుంది.

కీళ్లజబ్బు నిర్ధారణ: ఎక్స్‌రే, ఎమ్మారై, రక్త, మూత్ర పరీక్షలు, సీటీ స్కాన్, సైనోవియల్ కల్చర్ వంటి పరీక్షలు అవసరమవుతాయి.

చికిత్స: వైద్య పరీక్షల ద్వారా మోకాలునొప్పికి అసలు కారణం తెలుసుకుని దానికి అనుగుణంగా మందులు వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆధునిక హోమియో చికిత్స ద్వారా అలాంటి ఆపరేషన్స్ ఏవీ లేకుండానే మంచి చికిత్స అందించవచ్చు. హోమియో మందులు మోకాళ్లలో వ్యాధి లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల ఏర్పడే టాక్సిన్స్‌ను బయటకు పంపి నొప్పిని తగ్గిస్తాయి. గాయం వల్ల దెబ్బతిన్న భాగాలకు రక్తసరఫరాను పునరుద్ధరించి గాయం త్వరగా మానడానికి ఉపకరిస్తాయి. ఆస్టియో ఆర్థరైటిస్ వంటి వ్యాధుల నిర్ధారణ తొలిదశలోనే జరిగితే దెబ్బతిన్న కార్టిలేజ్‌ను తిరిగి రూపొందేలా చేయగల అవకాశం ఉంది. మోకాళ్ల నొప్పులకు హోమియోలో రస్టాక్స్, లెడమ్‌పాల్, కాల్కేరియా ఫాస్ వంటి మందులను వైద్యుల పర్యవేక్షణలో తగిన పొటెన్సీలో వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.]]>
వ్యాధులు - నివారణ Sun, 13 May 2012 20:25:32 +0000