Warning: session_start() [function.session-start]: Cannot send session cookie - headers already sent by (output started at /home/content/76/6254476/html/WS19/VO19/index.php:4) in /home/content/76/6254476/html/WS19/VO19/libraries/joomla/session/session.php on line 423

Warning: session_start() [function.session-start]: Cannot send session cache limiter - headers already sent (output started at /home/content/76/6254476/html/WS19/VO19/index.php:4) in /home/content/76/6254476/html/WS19/VO19/libraries/joomla/session/session.php on line 423

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home/content/76/6254476/html/WS19/VO19/index.php:4) in /home/content/76/6254476/html/WS19/VO19/libraries/joomla/session/session.php on line 426
యూరినరీ ఇన్ఫెక్షన్స్... హోమియో చికిత్స
Home వ్యాధులు - నివారణ యూరినరీ ఇన్ఫెక్షన్స్... హోమియో చికిత్స


 
యూరినరీ ఇన్ఫెక్షన్స్... హోమియో చికిత్స PDF Print E-mail
శరీరంలోని రక్తాన్ని వడపోసి, మలినాలను బయటకు పంపించే పని మూత్రపిండాలది. రక్తంలోని జీవరసాయన వ్యర్థాలను, శరీరానికి అవసరం లేని పదార్థాలను మూత్రపిండాలు వడగట్టి, రక్తం నుంచి వాటిని వేరుచేస్తాయి. మూత్రం ద్వారా ఇవి బయటకు విసర్జితమవుతాయి. శరీరంలోని ఎక్కువభాగం రక్తం గుండెనుంచి వెలువడిన వెంటనే మూత్రపిండాల ద్వారా వెళ్తుంది. కాబట్టి రక్తప్రవాహం వల్ల కలిగే ఒత్తిడిని మూత్రపిండాలూ ఎదుర్కొంటాయి. కాబట్టే రక్తపోటు మితిమీరినప్పుడు మూత్రపిండాలు చెడిపోయే అవకాశం ఎక్కువ. 

సాధారణంగా మూత్రం... బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులేవీ లేకుండా ఉంటుంది. అయితే మూత్రంలో ఉండే గ్లూకోజ్ వల్లగాని, ఇతర ఖనిజాల వల్లగాని బ్యాక్టీరియా చేరితే మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్స్ వచ్చేందుకు అవకాశం ఎక్కువ. అందుకే చక్కెరవ్యాధి ఉన్నవారికి మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్స్‌కు ఆస్కారం ఎక్కువ. ఇక పురుషుల్లో మూత్రనాళం అన్నది పురుషాంగం ద్వారా ప్రయాణిస్తే, మహిళలకు ఇది యోని లోపలే తెరచుకుంటుంది. అందుకే పురుషులతో పోలిస్తే మహిళల్లో యూరినరీ ఇన్ఫెక్షన్లు వచ్చేందుకు అవకాశం ఎక్కువ. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రతి ఐదుగురు మహిళల్లో కనీసం ఒకరు తమ జీవితకాలంలో ఒకసారైనా తప్పక మూత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్స్‌తో బాధపడతారు.

యూరినరీ ఇన్ఫెక్షన్లకు కారణం... 

సాధారణంగా మూత్రవ్యవస్థలో వ్యాధులు రావడానికి బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, మరికొన్ని ఇతర పరాన్నజీవులు కారణమవుతుంటాయి. ఇందులోనూ సాధారణంగా బ్యాక్టీరియా వల్ల మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. వీటిని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్‌గా చెబుతారు. 

సాధారణంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఒకసారి వస్తే తరచూ తిరగబెడుతుంటాయి. సంతాననిరోధక సాధనంగా డయాఫ్రమ్ వాడే మహిళల్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా కనిపించడం మామూలే. అలాగే మెనోపాజ్ దశకు చేరుకున్న మహిళల్లో ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల యోనిగోడలు, మూత్రాశయపు కిందిభాగం, మూత్రనాళ ప్రవేశద్వారం పలుచగా తయారై మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్స్ వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. 

పురుషుల్లో 50 ఏళ్లు దాటాక మూత్రసంబంధమైన వ్యాధులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వయసు పెరిగేకొద్దీ ప్రోస్టేట్ గ్రంథి పెరగడం ఒక కారణమైతే, ఆహారంలో మసాలాలు, మద్యం, కాఫీ వంటి వాటివల్ల కూడా మూత్రవిసర్జన సమయంలో మంట వచ్చే అవకాశం ఉంది. నైలాన్‌తో తయారుచేసిన అండర్‌వేర్స్ వల్ల కూడా కొందరిలో మూత్రవిసర్జన సమయంలో మంట రావచ్చు. 

హోమియో చికిత్స: అన్ని పరీక్షలు కూలంకషంగా నిర్వహించి మంట అన్నది మూత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్ వల్లనా లేక కిడ్నీలో రాళ్లు, కిడ్నీ వాపు, ఇతరత్రా కిడ్నీ సమస్యల వల్లనా అన్నది నిర్ధారణ చేసిన తర్వాతనే చికిత్స అందించాల్సి ఉంటుంది. హోమియోలో ఎపిస్, క్యాంథరిస్, నేట్రంమూర్, కెన్నబిస్, సబల్ సెర్యులేటా, సాలిడాగో, ఆర్స్ ఆల్బ్ వంటి మందులు మంచి ఫలితాలను ఇస్తాయి. - See more at: http://www.sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=65291&Categoryid=11&subcatid=20#sthash.WYbgUZtn.dpuf