Warning: session_start() [function.session-start]: Cannot send session cookie - headers already sent by (output started at /home/content/76/6254476/html/WS19/VO19/index.php:4) in /home/content/76/6254476/html/WS19/VO19/libraries/joomla/session/session.php on line 423

Warning: session_start() [function.session-start]: Cannot send session cache limiter - headers already sent (output started at /home/content/76/6254476/html/WS19/VO19/index.php:4) in /home/content/76/6254476/html/WS19/VO19/libraries/joomla/session/session.php on line 423

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home/content/76/6254476/html/WS19/VO19/index.php:4) in /home/content/76/6254476/html/WS19/VO19/libraries/joomla/session/session.php on line 426
అల్సర్స్ - Ulcer
Home వ్యాధులు - నివారణ అల్సర్స్ - Ulcer


 
అల్సర్స్ - Ulcer PDF Print E-mail

ulcerస్టమక్ అల్సర్స్

ఆహారాన్ని జీర్ణం చేయడానికి మన కడుపులో ఆమ్లం స్రవిస్తూ ఉంటుంది. అది ఆమ్లం కాబట్టి  ఆహారంపై పనిచేయడానికి బదులుగా మన కడుపు కండరాల మీదే పని చేస్తే కడుపులో మంట వస్తుంటుంది. ఇది చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే. యాసిడ్ వల్ల కనిపించే ప్రభావం కాబట్టి దీన్ని వాడుకభాషలో సైతం ‘ఎసిడిటీ’ అంటూ చాలామంది పేర్కొంటుండటం వల్ల ఇది ప్రజల్లో ఎంత ప్రాచుర్యంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ అదే యాసిడ్ క్రమక్రమంగా కడుపులోని కండరాలపై పనిచేస్తూ పోతే... జీర్ణవ్యవస్థ పొడవునా చాలా చోట్ల పుండ్లు పడే  అవకాశం ఉంది. అయితే ఇలా పుండ్లు పడటంలో వేళ తప్పి తినడం లాంటి వాటి కంటే హెచ్. పైలోరీ అనే బ్యాక్టీరియా, ఆస్పిరిన్ వంటి రక్తాన్ని పలచబార్చే మందులు, ఐబూప్రొఫిన్ వంటి నొప్పి నివారణ మందులు (ఎన్‌ఎస్‌ఏఐడీస్) ఎక్కువగా కారణమవుతాయి. ఈ పుండ్లనే పెప్టిక్ అల్సర్స్ అని వ్యవహరిస్తుంటారు.  ఇటీవల ఈ పెప్టిక్ అల్సర్లు ఎక్కువయ్యాయి. ఈ సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం.
 
అల్సర్లు... రకాలు!


జీర్ణవ్యవస్థ పొడవునా యాసిడ్ తన దుష్ర్పభావం చూపి, అక్కడి మెత్తటి కణజాలంపై పనిచేసి, ఆ మృదుకణజాలం ఒరుసుకుపోయేలా చేస్తుంది. ఇలా ఒరుసుకుపోయిన ప్రాంతమే పుండులా మారుతుంది. ఈ ఒరుసుకుపోయిన ప్రాంతం పేరును బట్టి సదరు అల్సర్ పేరును నిర్ణయిస్తారు. ఉదాహరణకు ఈసోఫేగస్ భాగంలో ఇలా ఒరుసుకుపోతే వాటిని ఈసోఫేజియల్ అల్సర్స్ అంటారు. జీర్ణాశయంలో పుండు పడితే దాన్ని గ్యాస్ట్రిక్ అల్సర్ అంటారు. ఇక చిన్న పేగులో మూడు భాగాలుంటాయి. చిన్నపేగులోని మొదటిభాగమైన డియోడినమ్ అనేచోట పుండు పడితే దాన్ని డియోడినల్ అల్సర్ అని... ఇలా అది ఏర్పడే ప్రదేశాన్ని బట్టి అల్సర్‌పేరును నిర్ణయిస్తారన్నమాట. స్థూలంగా చెప్పాలంటే ప్రదేశం వేరైనా అల్సర్లన్నీ ఒకేలాంటి ప్రభావం చూపిస్తాయి.
 
రిఫ్రాక్టరీ అల్సర్స్


ఇవి ప్రత్యేకమైన అల్సర్లు. కొన్నిసార్లు ఎంతగా చికిత్స తీసుకున్నా రోగి తాలూకు వ్యక్తిగత అలవాట్ల కారణంగానో (అంటే పొగాకు వినియోగం, ఆల్కహాల్ తాగడం వంటివి), హెలికోబ్యాక్టర్ పైలోరీ బ్యాక్టీరియాపై యాంటీబయాటిక్ మందులు పనిచేయకపోవడం వల్లనో (అంటే ఆ బ్యాక్టీరియా సదరు మందులపట్ల నిరోధాన్ని పెంచుకోవడం వల్ల), జోలింగర్-ఎలిసన్ సిండ్రోమ్ వల్లనో... అల్సర్లు ఎప్పటికీ తగ్గవు. పైగా కడుపులోని స్రావాలు మరింతగా పెరుగుతాయి. ఇలాంటి మొండి అల్సర్లను రిఫ్రాక్టివ్ అల్సర్స్ అంటారు.


గుర్తుంచుకోండి

గతంలో అల్సర్స్‌కు యాంటాసిడ్స్, సైటోప్రొటెక్టివ్ ఏజెంట్స్, హెచ్‌టూ బ్లాకర్స్ (ట్యాగమెట్, జాంటాక్) వంటి మాత్రలు వాడేవారు. కానీ అవి అల్సర్‌పై పని చేయవని ఆధునిక పరిశోధనల్లో తేలింది. కాబట్టి వాటిని  రొటీన్‌గా ప్రిస్క్రయిబ్ చేయడం, వాడటం మంచిది కాదు.

 లక్షణాలు

►కడుపులో మంటలా అనిపించే నొప్పి. ఒక్కోసారి ఈ మంట గొంతువైపునకు పాకుతున్నట్లుగా అనిపిస్తుంటుంది. ఛాతీ మీద మంటగా ఉన్నట్లుగా అనిపిస్తుంది.
►   ఎప్పుడూ ఆకలిగానే ఉన్నట్లుగా అనిపిస్తుంది. కొద్దిగా తినగానే కడుపు నిండిపోయినట్లుగా ఉంటుంది.
►   ఒక్కోసారి వికారంగా ఉంటుంది. వాంతులు కూడా కావచ్చు. వాంతులు అయినప్పుడు కొన్నిసార్లు రక్తం కూడా పడవచ్చు.
►  తిండి సయించకపోవడంతో ఎప్పుడూ నీరసంగా, అలసటగా ఉంటుంది.
►   ఛాతీకి కింద, కడుపునకు పైభాగంలో నొప్పిగా ఉండి, ఆ నొప్పి పెరిగి ఒక్కోసారి రాత్రివేళల్లో నిద్రాభంగం అవుతుంటుంది. ఆ నొప్పి వీపు వైపునకు కూడా పాకినట్లుగా అనిపిస్తుంది. (దీన్నే రిఫర్‌డ్ పెయిన్ అని అంటారు).
►  అల్సర్ల నుంచి రక్తస్రావం జరిగితే... ఆ రక్తం మలంలో కలవడం వల్ల మలం నల్లగా కనిపించే అవకాశాలూ ఉంటాయి.
►  బరువు తగ్గడం, ఛాతీ మీద ఏదో బరువు పెట్టినట్లుగా అనిపించడం వంటి లక్షణాలు చాలా సాధారణం.
►  అల్సర్ ఉన్నవారిలో భోజనం తిన్న తర్వాత అది ఈసోఫేజియల్ భాగం/ఛాతీ భాగంలో చిక్కుకుపోయినట్లుగా ఉంటుంది.

నిర్థారణ

► కడుపులో అల్సర్లు ఉన్న లక్షణాలు కనిపించినప్పుడు రక్తపరీక్షలూ, మల పరీక్షల ద్వారా ముందుగా హెలికోబ్యాక్టర్ పైలోరీ బ్యాక్టీరియా ఉందా అనే నిర్ధారణ పరీక్షలు చేయాలి.
► ఎండోస్కోపీ ప్రక్రియతో జీర్ణవ్యవస్థ పైభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి.
►   ఒకవేళ ఎక్కడైనా అల్సర్ కనిపిస్తే... ఆ భాగం నుంచి చిన్న ముక్క సేకరించి, దాన్ని బయాప్సీ పరీక్షకు పంపాలి.
►   రోగి చేత బేరియం ద్రవాన్ని తాగించి ఎక్స్-రే తీసి పరీక్ష చేయడం ద్వారా కూడా అల్సర్లను నిర్ధారణ చేయవచ్చు.
►  బయాప్సీ చేసినప్పుడు మనం హెచ్. పైలోరీ గురించి నిర్ధారణగా తెలుసుకోవచ్చు.
     బయాప్సీ ద్వారా అల్సర్‌లో క్యాన్సర్ ఉందా, లేదా తెలుస్తుంది. అందుకే స్టమక్ అల్సర్లన్నింటి విషయంలోనూ బయాప్సీ చేయించాలన్నది అంతర్జాతీయ సిఫార్సు (రికమండేషన్).
 
డాక్టర్‌ను ఎప్పుడు కలవాలంటే...


►మీ కడుపులో అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి మొదలై అది కడుపులో శూలంగా గుచ్చుతున్నంత తీవ్రంగా (ప్రికింగ్ పెయిన్) ఆగకుండా నొప్పి వస్తున్నప్పుడు.
► పొట్టను తడిమినప్పుడు మీ చేతికి అది మృదువుగా లేకుండా, చాలా గట్టిగా మారినట్లుగా అనిపిస్తున్నప్పుడు...
► నొప్పితో పాటు వాంతులు కావడం, అందులో రక్తం కనిపించడం వంటివి జరిగినా లేదా మలవిసర్జనకు వెళ్లినప్పుడు మలం నల్లగా కనిపించినప్పుడు...
► స్పృహ తప్పడం, అయోమయంగా మాట్లాడటం, తీవ్రంగా చెమటలు పట్టడం, తల అంతా తేలికైపోయిన భావన కలగడం, నిద్రవస్తున్నట్లుగా మత్తుగా అనిపించడం జరిగితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

 చికిత్స

► అల్సర్ ఏ ప్రాంతంలో ఏర్పడింది, అది ఏర్పడటానికి కారణం ఏమిటి అనే అనేక అంశాల మీద చికిత్స ఆధారపడి ఉంటుంది. ఒకవేళ హెలికోబ్యాక్టర్ పైలోరీ వల్ల అల్సర్లు ఏర్పడితే దానికి యాంటీబయాటిక్స్‌తో పాటూ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అనే మాత్రలు 10 నుంచి 14 రోజుల పాటు ఇస్తారు.
►హెలికోబ్యాక్టర్ పైలోరీ బ్యాక్టీరియా లేని అల్సర్స్‌కు కేవలం ప్రొటాన్ పంప్ ఇన్హిబిటర్స్‌ను 4 నుంచి 8 వారాల పాటు ఇస్తూ చికిత్స చేస్తారు.
►  కొన్ని సందర్భాల్లో కడుపులో స్రవించే యాసిడ్ పరిమాణం తగ్గేందుకు మందులు ఇస్తూ... దానితో పాటు కడుపులో ఏర్పడ్డ పుండ్లు మానేందుకూ మందులు రాస్తారు.
►  చికిత్సలో భాగంగా అల్సర్స్‌ను పుట్టేలా ప్రేరేపించే (అఫెండింగ్ ఏజెంట్స్) పొగతాగడం వంటి అలవాట్లను పూర్తిగా మానేయాలి.
  కొన్ని రిఫ్రాక్టరీ అల్సర్స్‌ను శస్త్రచికిత్స చేసి తొలగించాల్సి ఉంటుంది.


ప్రమాదకరంగానూ మారవచ్చు...

ఒక్కోసారి జీర్ణాశయంలోగానీ లేదా పేగుల్లో గానీ ఒరుసుకుపోయిన చోటే... మళ్లీ మళ్లీ ఒరుసుకుపోతే అది జీర్ణాశయానికి / పేగుకు రంధ్రంలా పడేందుకు అవకాశం ఉంది. ఇలాంటి కండిషన్‌ను అల్సర్ పెర్‌ఫొరేషన్ అయి అది పెరిటోనైటిస్ అనే కండిషన్‌కు దారి తీస్తుంది. ఇది ప్రాణాపాయాన్ని కలిగించే స్థితి. ఇలాంటి పరిస్థితుల్లో జీర్ణాశయంలో స్రవించే ద్రవాలు, ఆ మార్గానికే పరిమితం కాకుండా శరీరం (బాడీ-క్యావిటీ)లోని అన్ని భాగాలకూ విస్తరించి శరీరాన్ని విషపూరితం చేసే అవకాశం ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన కండిషన్. ఇలాంటప్పుడు అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు.
 
 నివారణ


► ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోండి. వేళకు భోజనం చేయండి. వేళతప్పి తినకండి.
►సమతులాహారం తీసుకోండి. మీ ఆహారంలో  పీచు పదార్థాలు ఉండే కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చేసుకోండి. మాంసాహారం తినాల్సి వచ్చినా... దానితో పాటు శాకాహారపు సలాడ్లు అంతే మోతాదులో తీసుకుంటూ ఉండండి.  
► బాగా ఉడికిన ఆహారాన్ని కాస్త వేడిగా (మరీ వేడిగా కాదు) ఉన్నప్పుడే తినండి. ఎలాగైనా సద్వినియోగం చేద్దామనే ఉద్దేశంతో చెడిపోయిన ఆహారాన్ని తీసుకోకండి. దానివల్ల జరిగే సద్వినియోగం కంటే మీరు మీ ఆరోగ్యానికి చేసుకునే హానే ఎక్కువ.
►  అల్సర్స్ మందులను డాక్టర్ సలహా మేరకు వాడాలి. ఎందుకంటే ఇందులో ఇచ్చే ప్రోటాప్ పంప్ ఇన్హిబిటర్స్ (పీపీఐ) మందులను భోజనానికి ముందే వాడాల్సి ఉంటుంది. అందుకే అల్సర్ మందుల విషయంలో ఎలాపడితే అలా వాడకుండా  డాక్టర్ సూచనలు పాటించడం తప్పనిసరి.
►  చిన్న చిన్న నొప్పులకు నొప్పి నివారణ మాత్రలు వాడకండి. వాటితో చాలా అనర్థాలు వస్తాయి. అంతగా నొప్పిని భరించలేకపోతే పారసిటమాల్ వంటి మందులను నొప్పి తగ్గించేందుకు ఒకటి రెండు రోజులు వాడవచ్చు. ఒకవేళ అప్పటికీ నొప్పి తగ్గకపోతే డాక్టర్‌ను కలవడం తప్పనిసరి.
►  పొగతాగడం, పొగాకు నమలడం, ఆల్కహాల్ తీసుకోవడం వంటి దురలవాట్లను వెంటనే మానేయండి. ఇలాంటి అల్సర్స్ విషయంలో పొగతాగే అలవాటు, ఆల్కహాల్ కంటే మరింత ప్రమాదకారి అని గుర్తించండి. అలాగని ఆల్కహాల్ కూడా మంచిదేమీ కాదు.
 ►  మలబద్దకం లేకుండా చూసుకోవడం మంచిది. ఇందుకోసం పీచు ఎక్కువగా ఉండే తాజా పండ్లు, ఏ సీజన్‌లో లభించేవి ఆ సీజన్‌లో వాడుతూ ఉండండి.
 ►అలాగే జీర్ణవ్యవస్థలోని కండరాల కదలికలు ఆరోగ్యంగా ఉండటానికి క్రమబద్ధంగా వాకింగ్ వంటి వ్యాయామాలు చేయండి.

 చివరగా...

పొట్టలో (స్టమక్) అల్సర్స్ ఉన్నవారు చికిత్స తీసుకున్న తర్వాత కూడా అవన్నీ తగ్గాయా లేదా అని మరోసారి నిర్ధారణ చేసుకోవాలి. ఎందుకంటే స్టమక్ అల్సర్స్‌లో ఒకవేళ క్యాన్సర్ లక్షణాలు ఉంటే అలాంటివి చికిత్స తర్వాత కూడా తగ్గవు. కాబట్టి అలాంటివి ఏవైనా ఉంటే వాటిని ఒకసారి బయాప్సీ తీసి పరీక్ష చేయాలి. కానీ డియోడినల్ అల్సర్స్ విషయంలో ఈ జాగ్రత్త అవసరం లేదు. కాబట్టి అల్సర్స్ ఉన్నాయని తేలితే, ఆ అంశాన్ని తేలిగ్గా తీసుకోకుండా డాక్టర్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి.

 డాక్టర్ గురు ఎన్. రెడ్డి
 చీఫ్ ఆఫ్ గ్యాస్ట్రోంటరాలజీ -
 లివర్ డిసీజెస్,
 చైర్మన్ - ఎండీ.,
 కాంటినెంటల్ హాస్పిటల్స్,
 గచ్చీబౌలీ, హైదరాబాద్