Warning: session_start() [function.session-start]: Cannot send session cookie - headers already sent by (output started at /home/content/76/6254476/html/WS19/VO19/index.php:4) in /home/content/76/6254476/html/WS19/VO19/libraries/joomla/session/session.php on line 423

Warning: session_start() [function.session-start]: Cannot send session cache limiter - headers already sent (output started at /home/content/76/6254476/html/WS19/VO19/index.php:4) in /home/content/76/6254476/html/WS19/VO19/libraries/joomla/session/session.php on line 423

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home/content/76/6254476/html/WS19/VO19/index.php:4) in /home/content/76/6254476/html/WS19/VO19/libraries/joomla/session/session.php on line 426
Outsourcing - ఔట్‌సోర్సింగ్
Home Vidhya - విద్య Outsourcing - ఔట్‌సోర్సింగ్


 
Outsourcing - ఔట్‌సోర్సింగ్ PDF Print E-mail
పెద్ద పెద్ద డిగ్రీలు అవసరం లేకుండా ఇంటర్మీడియెట్ అర్హతతోనే ఐదంకెల జీతం సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.. బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ (బీపీఓ). ఇంగ్లిష్ భాషపై పట్టు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు బీపీఓలో చేరొచ్చు.

ఒక కంపెనీ తన నాన్ కోర్ వ్యవహారాలను వేరే దేశానికి బదిలీచేసి తక్కువ వ్యయానికే అక్కడి నుంచి ఐటీ ఆధారిత సేవలను అందుకోవడాన్నే బీపీవో అంటారు. దీన్నే ఐటీ ఎనాబిలిడ్ సర్వీసెస్(ఐఈటీఎస్) అని కూడా పేర్కొంటారు. ఇంగ్లిష్ మాట్లాడే యువత, కంప్యూటర్‌పై విస్తృత అవగాహన, తక్కువ ఖర్చుకే మానవ వనరుల లభ్యత, అనుకూలమైన టైమ్ జోన్, నాణ్యమైన పనితీరుతో బీపీవో కార్యకలాపాలకు భారత్ ప్రధాన కేంద్రమైంది.

భారత్-బీపీవో రంగం:
కాల్ సెంటర్లు: కాల్ సెంటర్ అనేది సేవల కేంద్రం. ఇక్కడ ఫోన్లు, ఇంటర్నెట్, విస్తృతమైన డేటాబేస్, వాయిస్ ఆధారిత, వెబ్ ఆధారిత సమాచారంతో సుశిక్షితులైన మానవ వనరుల ద్వారా దేశ విదేశాల్లోని వినియోగదారులకు వివిధ సేవలు అందుతాయి. బ్యాంకింగ్, తయారీ రంగం, మార్కెట్ రీసెర్చ్, ఫార్మాస్యూటికల్స్, సేల్స్, ఆర్డర్ డెస్క్, కస్టమర్ సర్వీసెస్, హెల్ప్ డెస్క్, ఎమర్జెన్సీ డిస్పాచ్, క్రెడిట్ కలెక్షన్స్, ఫుడ్ సర్వీసెస్, ఎయిర్‌లైన్/హోటల్ రిజర్వేషన్స్ వంటి అన్ని రంగాల్లోనూ.. కాల్ సెంటర్లు ఉన్నాయి.

భవిష్యత్ అవకాశాలు:
నాస్‌కామ్ అంచనాల ప్రకారం- బీపీవో పరిశ్రమలో వ్యాపార అవకాశాలున్న విభాగాలు..
కస్టమర్ సపోర్ట్ సర్వీసెస్: ఇందులో టెక్నికల్ హెల్ప్, హెల్ప్ డెస్క్ కార్యకలాపాలుంటాయి. ఉద్యోగులు కార్పొరేట్, ఇతర క్లయింట్లకు సేవలు అందిస్తారు. ఇందులో కస్టమర్‌తో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది.

మార్కెటింగ్ సర్వీసెస్: ఇందులో ప్రధానంగా సేల్స్, మార్కెటింగ్ ఉంటాయి. ఇది టెలిమార్కెటింగ్. కంటెంట్ డెవలప్‌మెంట్, కన్సల్టెన్సీ ప్రధానంగా ఉంటాయి. సేల్స్ ప్రక్రియలో భాగంగా ఫోన్ ద్వారా ఆర్డర్లు ఇచ్చే వినియోగదారులకు సేవలు అందుతాయి.

హ్యూమన్ రీసోర్స్ సర్వీసెస్: ఇందులో పేరోల్ బెనిఫిట్స్, ఎడ్యుకేషన్/ట్రైనింగ్, రిక్రూటింగ్, పర్సనల్ అడ్మినిస్ట్రేషన్, కంటింజంట్ వర్క్ ఫోర్స్ మేనేజ్‌మెంట్, వర్క్‌ఫోర్స్ అనాలసిస్ అవుట్ సోర్స్ అవుతాయి.

ఫైనాన్స్, అకౌంటింగ్ సర్వీసెస్: ఇది ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ కార్యకలాపాలతో మొదలైన ప్పటికీ క్లయింట్‌లు తమ బిజినెస్ నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా ఫైనాన్షియల్ అనాలసిస్ సొల్యూషన్స్ కూడా అందించే అవకాశముంది.

ఇంజనీరింగ్ సర్వీసెస్: ప్రొడక్ట్, లేదా సేవల ఉత్పత్తిలో టెక్నికల్ కన్సల్టెన్సీని అందించడం దీనిలో ప్రధాన విధి. ఇందులో ప్రధానంగా రీసెర్చ్, డెవలప్‌మెంట్, ప్రొడక్ట్ డెవలప్ మెంట్, ప్రొడక్ట్ డిజైన్, టెస్టింగ్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, డాక్యుమెంటేషన్, ఇంజనీరింగ్ అనాలసిస్ ఉంటాయి.

లాజిస్టిక్స్: ఇందులో సప్లై చైన్ మేనేజ్‌మెంట్ ప్రధానం. ఇన్వెంటరీ కాస్ట్‌ను తగ్గించడం, డెలివరీ షెడ్యూల్‌ను మెరుగుపర్చడం దీని ప్రధాన ఉద్దేశం. ఇన్‌వాయిస్ కలెక్షన్, పేమెంట్ ప్రాసెసింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ రూట్ ఆప్టిమైజేషన్, వేర్‌హౌసింగ్, ఇన్‌వెంటరీ కంట్రోల్ సేవలు కూడా ఉంటాయి.

హెల్త్‌కేర్: మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్ సేవలతో ఇది ప్రారంభమైంది. తాజా ట్రెండ్ డిసీజ్ మేనేజ్‌మెంట్, మెడికల్ ఇమేజింగ్ సేవలు.

ఫ్రెషర్స్‌కు జాబ్ ప్రొఫైల్స్: కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, క్వాలిటీ అనలిస్ట్, వాయిస్ ట్రైనర్, ప్రాసెస్ ట్రైనర్,సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, టెలీ కాలర్,కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, ప్రాసెస్ అసోసియేట్,కాన్ఫరెన్స్ ఎగ్జిక్యూటివ్,టెలిమార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్...లాంటి హోదాలుంటాయి
వేతనాలు: చాలామంది తాజా గ్రాడ్యుయేట్లకు బీపీవో జాబ్ ఆకర్షణీయంగా మారడానికి ప్రధాన కారణం..పే ప్యాకేజ్. ఎమ్మెన్సీల్లో సాధారణంగా ప్రారంభ వేతనం నెలకు 20,000 వరకూ ఉంటుంది.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. రాత పరీక్షలో ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ ఉంటాయి. ఇంటర్వ్యూలో ఇంగ్లిష్‌లో సరిగా మాట్లాడుతున్నారా లేదా అనేది పరీక్షిస్తారు. టెక్ సపోర్ట్‌కి రైటింగ్ స్కిల్స్, కస్టమర్ కేర్‌కి యాక్సెంట్ ప్రధానంగా గమనిస్తారు.

స్కిల్స్:
ఇంగ్లిష్‌పై గట్టి పట్టుండాలి.
కంప్యూటర్ నాలెడ్జ్, టైపింగ్ స్పీడ్, మార్కెటింగ్ నైపుణ్యాలు, కస్టమర్ల ప్రవర్తనపై అవగాహన అవసరం.
డేటాబేస్‌లోకి సమాచారాన్ని వేగంగా చేర్చగలగడం, తిరిగి తీసుకోవడం తెలియాలి.
సమస్యలను విశ్లేషించే సామర్థ్యాలుండాలి.
మంచి కమ్యూనికేషన్‌తోపాటు లిజనింగ్ స్కిల్స్ కూడా చాలా అవసరం.
ఓపిగ్గా వినడంతోపాటు కస్టమర్‌ను ఒప్పించగలిగే నైపుణ్యాలుండాలి.
టాప్ బీపీఓ కంపెనీలు: డెల్, జీఈ, ఐబీఎం, డెలాయిట్, హెచ్‌పీ, అసెంచర్, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో....

అసెంచర్‌తో కలిసి ఇగ్నో 6 నెలల ఆన్‌లైన్ బీపీవో శిక్షణ కోర్సును ప్రారంభించింది.
వెబ్‌సైట్: www.ignou.ac.in

జెన్‌ప్యాక్ట్‌తో కలిసి నిట్... యూఎన్‌ఐక్యూయూఏ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తోంది.
వెబ్‌సైట్: www.niituniqua.com