Warning: session_start() [function.session-start]: Cannot send session cookie - headers already sent by (output started at /home/content/76/6254476/html/WS19/VO19/index.php:4) in /home/content/76/6254476/html/WS19/VO19/libraries/joomla/session/session.php on line 423

Warning: session_start() [function.session-start]: Cannot send session cache limiter - headers already sent (output started at /home/content/76/6254476/html/WS19/VO19/index.php:4) in /home/content/76/6254476/html/WS19/VO19/libraries/joomla/session/session.php on line 423

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home/content/76/6254476/html/WS19/VO19/index.php:4) in /home/content/76/6254476/html/WS19/VO19/libraries/joomla/session/session.php on line 426
కార్పొరేట్ ప్రపంచంలో ఉజ్జ్వల కెరీర్‌కు.. క్యాట్ CAT
Home Vidhya - విద్య కార్పొరేట్ ప్రపంచంలో ఉజ్జ్వల కెరీర్‌కు.. క్యాట్ CAT


 
కార్పొరేట్ ప్రపంచంలో ఉజ్జ్వల కెరీర్‌కు.. క్యాట్ CAT PDF Print E-mail
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లలో చేరితే..కోర్సు ప-ర్తి కాకముందే కార్పొరేట్ దిగ్గజాలు రెడ్ కార్పెట్ పరుస్తాయి. కార్పొరేట్ ప్రపంచంలో ఉజ్జ్వల కెరీర్‌కు పునాది ఐఐఎంలు. అలాంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశానికి మార్గం కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్).. అందుకే ‘క్యాట్’ పరీక్ష అంటే యువతకు ఎంతో క్రేజ్. 2012 సంవత్సరానికి క్యాట్ నోటిఫికేషన్
విడుదలైంది.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) లలో పీజీ పట్టా పొందడమంటే.. అవకాశాలకు ఆకాశమే హద్దు. దేశ వ్యాప్తంగా 13 నగరాల్లో ఐఐఎం క్యాంపస్‌లు ఉన్నాయి. వీటిల్లో అడ్మిషన్ పొందడం ద్వారా ఉన్నత కెరీర్‌కు బాటలు వేసుకోవాలనుకునే విద్యార్థులు ఎందరో. దాదాపు 3000 సీట్ల కోసం పోటీ లక్షల్లోనే ఉంటుంది. కాబట్టి పకడ్బందీ ప్రిపరేషన్‌తో విజయం సాధ్యం.

గతేడాది మాదిరిగానే:
క్యాట్ పరీక్షను ఈ ఏడాది ఐఐఎం-కోజికోడ్ కో-ఆర్డినేట్ చేస్తుంది. కంప-్యటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో పరీక్షను నిర్వహిస్తారు. అన్ని రకాల అకడెమిక్ బ్యాక్‌గ్రౌండ్లకు చెందిన విద్యార్థులను ప్రోత్సహించడానికి వీలుగా గతేడాది ప్రారంభించిన ఎగ్జామ్ ప్యాట్రన్‌నే ఈ ఏడాది కూడా అమలు చేస్తున్నారు. ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. అవి.. క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ ప్రిటేషన్; వెర్బల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్. పరీక్షలో..ఈ రెండు విభాగాలకు ప్రత్యేకమైన సమయ పరిమితి ఉంటుంది. ప్రతి విభాగానికి 70 నిమిషాల చొప్పున మొత్తం 140 నిమిషాల సమయాన్ని సమాధానాలను గుర్తించడానికి కేటాయించారు. ప్రతి సెక్షన్లో 30 ప్రశ్నలకు సమాధానం రాయాలి. ప్రతి సెక్షన్‌కు కౌంట్‌డౌన్ టైమర్ నిబంధన ఉంటుంది. నిర్దిష్ట సెక్షన్‌కు కేటాయించిన సమయం ప-ర్తయితే సమాధానలివ్వడం ప-ర్తి కాకున్నా మరో సెక్షన్‌కు వెళ్లాలి.

ట్యుటోరియల్-ప్రాక్టీస్ టెస్ట్:
పరీక్ష ప్రారంభానికి ముందు.. కంప-్యటర్ బేస్డ్ టెస్ట్ సమయంలో ఎలా వ్యవహరించాలి అనే విషయంలో అభ్యర్థులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో సూచనలు, సలహాలతో కూడిన 15 నిమిషాల ట్యుటోరియల్ అందుబాటులో ఉంటుంది. రిపోర్టింగ్ టైమ్ విషయానికొస్తే.. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గంటన్నర ముందు రిపోర్ట్ చేయాలి. వెబ్‌సైట్‌లో క్యాట్-2012 ప్రాక్టీస్ టెస్ట్ అందుబాటులో ఉంది. క్యాట్ టెస్ట్ సైట్స్ వివరాలు రిజిస్ట్రేషన్ ప్రారంభమైన తర్వాత అందుబాటులోకి వస్తాయి.

ప్రవేశ విధానం:
క్యాట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులు.. దేశ వ్యాప్తంగా ఉన్న 13క్యాంపస్‌లలో.. తమకు నచ్చిన ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవే శం కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక ఇన్‌స్టిట్యూట్‌లను బట్టి వేర్వేరుగా ఉంటుంది. సాధారణంగా క్యాట్ స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు.. రిటెన్ ఎబిలిటీ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ వంటి పద్ధతుల ద్వారా అడ్మిషన్ కల్పిస్తారు. షార్ట్‌లిస్ట్ సమయం లో.. ప్రీవియస్ అకడెమిక్ రికార్డు, వర్క్ ఎక్స్‌పీరియెన్స్ తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. వివరాల కోసం ఆయా ఇన్‌స్టిట్యూట్‌ల వెబ్‌సైట్లను చూడొచ్చు.

క్యాట్-2012 సమాచారం
అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం (ఎస్సీ/ఎస్టీ/డిఫెరెంట్లీ ఎబుల్డ్‌లకు 45 శాతం) మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమానం.
దరఖాస్తు విధానం: ఎంపిక చే సిన యాక్సిస్ బ్యాంక్ శాఖల నుంచి క్యాట్ వోచర్‌ను కొనుగోలు చేయాలి. తర్వాత ఆన్‌లైన్‌లో ఎగ్జామ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. www.catiim.in వెబ్‌సైట్ ఓపెన్ చేసి ‘రిజిస్టర్ ఫర్ క్యాట్ 2012’ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయూలి. ఆ వెంటనే ఓ ప్రత్యేక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అందులో వోచర్ నెంబర్ అనే ఆప్షన్‌లో సంబంధిత వోచర్ నెంబర్‌ను ఎంటర్ చేయడంతోపాటు.. దానికింద సెక్యూరిటీ కోడ్ బాక్స్‌లో నెంబర్లను ఎంటర్ చేయూలి.

సెక్యూరిటీ కోడ్ బాక్స్‌పైన అప్పటికే కనిపించిన నెంబర్లనే రాయూలి. ఈ రెండు ప్రక్రియలు ప-ర్తయ్యూక ‘సబ్మిట్’ బటన్ మీద క్లిక్ చేస్తే.. క్యాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో తొలుత లాగిన్ విండో ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ క్రమంలో అభ్యర్థులు ఐఐఎంలు, కోర్సుల వివరాలను ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. రిజిస్ట్రేషన్ సంబంధిత వివరాల కోసం www.catiim.in చూడొచ్చు.

వోచర్ల అమ్మకం: జూలై 30-సెప్టెంబర్ 17, 2012
రిజిస్ట్రేషన్ షెడ్యూల్:జూలై 30-సెప్టెంబర్19, 2012
టెస్ట్ షెడ్యూల్: అక్టోబర్ 11 - నవంబర్ 6, 2012
ఫలితాల విడుదల: జనవరి 9, 2013
వివరాలకు: www.catiim.in

ప్రిపరేషన్ టిప్స్

అవగాహన:
ముందుగా పరీక్షలో అడిగే నాలుగు సబ్జెక్ట్‌లు.. క్వాంటిటేటివ్, వెర్బల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌పై అవగాహన పెంచుకోవాలి. క్వాంటిటేటివ్ ఎబిలిటీలో.. అల్జీబ్రా, జా మెట్రీ, ట్రిగ్నోమెట్రీ, మెన్సురేషన్ వంటి అంశాలు ఉంటాయి. వెర్బల్ ఎబిలిటీలో రీడింగ్ కాంప్రెహెన్షన్, గ్రామర్, వొక్యాబులరీ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో గ్రాఫ్స్, చార్ట్స్ సంబంధ ప్రశ్నలు అడుగుతారు.

బేసిక్స్‌పై పట్టు:
అందరూ భావిస్తున్నట్లు క్యాట్ క్లిష్టంగా ఉండదు. మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లలోని నాలెడ్జ్‌ను టెస్ట్ చేసే విధంగా ఉంటుంది. ఇవి కూడా స్కూల్ స్థాయికి అటుఇటుగా ఉంటాయి. కాబట్టి క్యాట్‌కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సంబంధిత అంశాల్లోని బేసిక్స్‌పై పట్టు సాధించే విధంగా కృషి చేయాలి అంటున్నారు క్యాట్-2011లో 99.99 పర్సంటైల్‌తో టాపర్‌గా నిలిచిన శేఖర్ ఆనంద్. కాబట్టి ప్రాథమిక దశ నుంచి ప్రిపరేషన్ సాగించడం మంచిది. అంశాల వారీగా.. సీబీఎస్‌ఈ/ ఐసీఎస్‌ఈ పదో తరగతి మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ గ్రామర్ పుస్తకాలు చదవాలి. టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ, ఎకనామిక్ టైమ్స్ వంటి దిన పత్రికలను క్రమం తప్పకుండా చదవాలి. వీటిల్లో ఉపయోగించే పదాల కోసం ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీని రిఫర్ చేయడం కూడా ఇంగ్లిష్ ఇంప్ర-వ్ అవ్వడానికి దోహదం చేస్తుంది.


బలాలు-బలహీనతలు:
క్యాట్ ప్రిపరేషన్ క్రమంలో అభ్యర్థులు ముందుగా స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. అంశాల వారీగా తమ అవగాహన స్థాయి తెలుసుకోవాలి. ఇందు కోసం మాక్ టెస్ట్‌లకు హాజరవ్వాలి. తమ అవగాహన స్థాయిని రివ-్య చేసుకోవాలి. దీన్ని ఆధారంగా చేసుకుని ప్రిపరేషన్ ప్లాన్ రూపొందించుకోవచ్చు. ఒక సెక్షన్లో తక్కువ స్కోర్ చే యడానికి గల కారణాలను విశ్లేషించుకోవాలి. కాన్సెప్ట్‌పై పట్టు లేకపోవడమా లేదా ప్రాక్టీస్ లేకపోవడమా? ఏది కారణమనే విషయాన్ని సమీక్షించుకోవాలి. ప్రతి విభాగంలో తప్పు చేస్తున్న అంశాలపై దృష్టి సారించి వాటికి ప్రత్యేక స్ట్రాటజీ రూపొందించుకోవాలి. వీక్‌గా ఉన్న సెక్షన్లో స్ట్రాంగ్ అయ్యే విధంగా పట్టు ఉన్న విభాగాలపై మరింత పట్టు సాధించేలా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండాలి.

టైమ్ మేనేజ్‌మెంట్:
పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తేదీ, అందుబాటులో ఉన్న సమయం, వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా సెక్షన్ల వారీగా అందుబాటులో ఉన్న సమయాన్ని విభజించుకుని టైమ్ టేబుల్ రూపొందించుకోవాలి. మంచి స్కోర్ చేసిన సబ్జెక్టుకు ఎక్కువ సమమం కేటాయించాలి. అదే సమయంలో తక్కువ స్కోర్ చేసిన సెక్షన్లను విస్మరించకూడదు. వారానికి కనీసం రెండు మాక్ టెస్ట్‌లు రాసే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. తర్వాత వీటి సంఖ్య మూడుకు పెంచాలి. తర్వాత ఫలితాలను విశ్లేషించుకుని అవసరమైతే బేసిక్స్‌పై దృష్టి సారించాలి. ప్రతి అభ్యర్థి సెప్టెంబర్ చివరి నాటికి వీలైనంత ఎక్కువ అంశాల్లో ప్రతిభను మెరుగుపరుచుకునేలా లక్ష్యం ఏర్పరచుకోవాలి. ఆ తర్వాత నుంచి పరీక్ష రోజు వరకు అందుబాటులో ఉన్న సమయంలో నేర్చుకున్న అంశాల పునశ్చరణకు కేటాయించాలి. పునశ్చరణ వల్ల కాన్సెప్ట్‌లపై మరింత పట్టుకు వీలవుతుంది. ఈ సమయంలో కొత్త అంశాలను ప్రయత్నించడం సరికాదు.

ఇటు ప్రిపరేషన్, అటు పరీక్ష సమయంలో టైం మేనేజ్‌మెంట్ ఎంతో ప్రధానం. ముఖ్యంగా గత ఏడాదే మొదలు పెట్టిన ఆన్‌లైన్ టెస్ట్ విధానంతో టైం మేనేజ్‌మెంట్ ఆవశ్యకత ఎంతో పెరిగింది. రీజనింగ్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్ విభాగాల్లో కష్టమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందువల్ల చివర్లో సమయం చాలక మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. సులువైన, ఎక్కువ మార్కులు వచ్చే విభాగాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రిపరేషన్ సాగిస్తే విజయం సాధించవచ్చు. ఈ విషయంలో పరీక్ష సమయంలో నిర్ణీత విభాగంలో సామర్థ్యం, కేటాయించాల్సిన సమయాలను పరిగణనలోకి తీసుకోవాలి.

ప్రశ్నల ఎంపిక:
క్యాట్ మాత్రమే కాకుండా ఇతర పరీక్షల్లోనూ విజయానికి దోహదం చేసే వ-్యహం ప్రశ్నల ఎంపిక. నిర్ణీత సెక్షన్‌కు కేటాయించిన సమయంలో ముందుగా బాగా వచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తర్వాతే మిగతా ప్రశ్నలవైపు దృష్టి సారించాలి. దీనికి ఎలాంటి ప్రిపరేషన్, టెక్నిక్స్ ఉండవు. ప్రతి విద్యార్థి స్వయంగా తమ అవగాహన స్థాయి ఆధారంగానే దీన్ని గుర్తించాలి.

సబ్జెక్టుల వారీగా రీడింగ్ కాంప్రహెన్షన్:
ఇందులో రాణించాలంటే సునిశిత పరిశీలన, ఏకాగ్రత అవసరం. రీడిం గ్ ప్రాక్టీస్ చేయాలి. దినపత్రికలు, మేగజీన్లు, ఇంటర్నెట్ బ్లాగ్స్ చక్కటి మార్గాలు. గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయం వరకు ఆర్థిక, సామాజిక, రాజకీయ, సమకాలీన అంశాలపై అవగాహన మేలు చేస్తుంది. ఒక అంశం సారాంశాన్ని సంక్షిప్తంగా రాసే నైపుణ్యం సొంతం చేసుకోవాలి.

క్వాంటిటేటివ్ ఎబిలిటీ:
ఇందులో మంచి మార్కులకు బేసిక్స్‌పై పట్టు ప్రధాన మార్గం. ఒక చాప్టర్‌లోని అంశాలను విభజించుకుని ప్రాక్టీస్ చేయడం సముచితం. ముఖ్యంగా నంబర్స్, జామెట్రీ, అల్జీబ్రా విభాగాల్లో ఈ విధానం ఎంతో అవసరం. ప్రాక్టీస్ కూడా ఎంతో ముఖ్యం. నేరుగా సమాధానాలను ఆలోచించకుండా నిర్ణీత సమస్యకు సంబంధించి ఫార్ములా ఆధారంగా దశల వారీగా సమాధానం పొందే విధంగా నైపుణ్యం సాధించాలి.

లాజికల్ రీజనింగ్:
అభ్యర్థులు తమ స్వీయ ఆలోచనతో రాణించగలిగే విభాగమిది. ఒక సమాచారం ఇచ్చి దాని ఆధారంగా అడిగే ప్రశ్నలకు సమాధానాలివ్వాల్సి ఉంటుంది. కాబట్టి ప్రశ్నల్లోని స్టేట్‌మెంట్లను ఇతర స్టేట్‌మెంట్లతో పోల్చి ‘కీ’లక పరిష్కారాన్ని గుర్తించే నైపుణ్యం అవసరం.

డేటా ఇంటర్‌ప్రిటేషన్:
ఇతర సబ్జెక్టులతో పోల్చితే అభ్యర్థులకు క్లిష్టంగా భావించే విభాగం డేటా ఇంటర్‌ప్రిటేషన్. పైచార్ట్‌లు, గ్రాఫ్‌లు, టేబుల్స్‌ను విశ్లేషిస్తూ ప్రిపరేషన్ సాగించాలి. అంతేకాకుండా.. సూక్ష్మ పరిశీలన, కాలిక్యులేషన్, లాజికల్ రీజనింగ్ ఆధారిత ప్రశ్నలు కూడా ఉంటాయి. ఈ విభాగంలో పట్టు కోసం సాధనం నిరంతర ప్రాక్టీస్. ఒక నిర్ణీత అంశాన్ని వేగంగా విశ్లేషించే సామర్థ్యం సొంతం చేసుకోవాలి. ముఖ్యంగా పర్సంటేజీ, యావరేజెస్‌పై పట్టు సాధించాలి.